యూఎస్ లో సరికొత్త సిండ్రోమ్.. భయాందోళనలో ప్రజలు..

Divya
ఇటీవల అమెరికా అధ్యక్షుడు కమల్ హారిస్ సింగపూర్ నుండి వియత్నాం కు ఆగస్టు 24వ తేదీన పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇందులో అమెరికా అధ్యక్షుడు .. హవానా లో పట్టిపీడిస్తున్న సరికొత్త సిండ్రోమ్ గురించి పర్యటించారు. దాదాపుగా 2016 సంవత్సరం లోని కనుగొనబడిన ఈ సిండ్రోమ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక కొద్ది సంవత్సరాల కిందట ఈ సిండ్రోమ్ కి భయపడి ఎంతో మంది అధికారులు కూడా ఈ లక్షణాలను భరించలేక , వారు ఉన్న పదవులకు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారట.

అయితే ఈ సిండ్రోమ్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..? దీని గల కారణం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

సిండ్రోమ్ అనగా కొన్ని అనారోగ్య లక్షణాలు సమూహం అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు పర్యటన తర్వాత ఈ సిండ్రోమ్  వెలుగులోకి వచ్చింది.

మొదటిసారిగా 2016వ సంవత్సరంలో హవానాలోని, అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్న కొంతమంది గూఢచారులకి  ఈ సిండ్రోమ్ సోకినట్లు అధికారులు తెలిపారు. కేవలం ఇవే కాకుండా ఇప్పుడు చాలా దేశాలలో ఈ సిండ్రోమ్ తో కొన్ని డజన్ల మంది ప్రజలు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ నివేదించిన ప్రకారం హావానా లో  130 కంటే ఎక్కువ మంది ఈ సిండ్రోమ్ బారిన పడ్డట్టు తెలిపారు. జర్మనీ ,ఆస్ట్రియా, రష్యా , చైనా తో సహా మరికొన్ని దేశాలలో పనిచేస్తున్న అమెరికన్లలో ఈ సిండ్రోమ్ వ్యాధి ని గుర్తించినట్లు తెలుస్తోంది..

ఈ సిండ్రోమ్ వ్యాపించినప్పుడు రోగిలో  లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కడుపులో వికారం, వినికిడి లోపం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలను గుర్తించవచ్చు. అయితే ఇటీవల ఎవరైతే ఈ సిండ్రోమ్ బారిన పడ్డారో , వారి కోసం  ప్రత్యేకంగా గట్టిగా శబ్దాలు చేస్తూ వినిపించడం కూడా జరిగింది. కానీ వారు అలాంటి సమయంలో తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు చెవి నొప్పి, తలనొప్పి, అదుపు తప్పడం ,కండరాలు నియంత్రించుకోలేక పోవడం ,దృష్టి అలాగే వినికిడి లోపం వంటివి కూడా ఈ సిండ్రోమ్ యొక్క లక్షణాలు.

2016 సంవత్సరంలో క్యూబా రాజధాని అయిన హవానా లో మొట్టమొదటిసారిగా ఈ సిండ్రోమ్ కేసును అధికారులు కనిపెట్టినప్పుడు ,ఎవరైతే ఈ సిండ్రోమ్ బారినపడ్డారో వారి తలలో ఒత్తిడి తరంగాల ద్వారా చ తల పగిలి పోయినట్లుగా అనిపించినట్లు NYT  నివేదిక పేర్కొంది.

ఈ సిండ్రోమ్ రోగి శరరంలో ఎంత కాలం ఉంటుంది అంటే, కొంత మందిలో లక్షణాలు త్వరగానే వెళ్ళిపోవచ్చు లేదా మరి కొంతమందిలో ఇది చాలా కాలం కూడా ఉండవచ్చు. ఈ సిండ్రోమ్  రావడానికి గల కారణం ఏమిటి అంటే , ఇప్పటి వరకు ఎలాంటి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. దీనికి కావలసిన పూర్తి సమాచారాన్ని  తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది

ఇకపోతే కొంత మంది సైంటిస్టులు తెలిపిన నివేదిక ప్రకారం ఎవరైతే చాలా ఒత్తిడికి గురవుతారో.. అలాంటి వారిలో మానసిక ఆరోగ్యం తలెత్తడం , తద్వారా సిండ్రోమ్ కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: