సాధారణంగా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చూస్తేనే కొందరు జనాలు భయపడిపోతుంటారు. ఇక స్నేక్, తేలును చూస్తే చాలు భయంతో అవి ఉన్న ఏరియా వైపు అస్సలు వెళ్లబోరు కొంతమంది. ముఖ్యంగా తేలును చూస్తే భయపడేవారు బోలెడు మంది ఉంటారు. అవి ఎక్కడ మనల్ని కుడుతాయో అని భయపడిపోతుంటారు. వాటి నుంచి ఆమడ దూరంలోనే ఉండాలని భావిస్తుంటారు. తేలు నుంచి వచ్చే విషం ద్వారా ఒక్కో సారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తేలును చూసి పారిపోతుంటారు.
అయితే, ఆ ప్రాంతంలో తేలుతో కుట్టించుకునేందుకుగాను జనాలు విపరీతంగా వస్తుంటారు. అదేంటీ.. తేలును చూస్తేనే భయపడే
ఈ రోజుల్లో అక్కడ తేళ్ల వద్దకు జనాలు వెళ్లడమేంటీ? అనుకుంటున్నారా.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. అయితే, అక్కడ తేళ్లు కుట్టనప్పటికీ జనాలకు ఏం కాదట. ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్ల కోసం ఓ సెపరేట్ ఫెస్టివల్ ఉంది. ఈ ప్రాంతంలో వారి పూర్వీకుల నుంచి ఈ
పండుగ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే, ఇది మూఢనమ్మకమని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయినప్పటికీ ఇక్కడి జనాలు ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా సెలబ్రేట్ చేసుకుంటుండటం గమనార్హం. ఈ ప్రాంతంలో ప్రజలు తేలు కనిపిస్తే చాలా లక్కీగా ఫీలవుతుంటారు. వెంటనే వాటిని చేతితో పట్టుకుని దేవుడికి మాలగా వేస్తారు.
పూజలు చేసి తమ కోరికలు నెరవేర్చాలంటూ
గుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై వెలసిన కొండలరాయుడి ఆలయంలో తేలుని కూడా దేవుడిలా పూజించడం ప్రత్యేకం. కొండలరాయుడి స్వామి
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతి రూపమని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ప్రతీ ఏడాది శ్రావణ మాసం మూడో సోమవారం ఈ ప్రాంతంలో విశేష పూజలు జరుగుతాయి. అయితే, ఈ ప్రాంతంలోని కొండపై ఏ రాయిని కదిపినా తేలు ప్రత్యక్ష్యమవుతందట. దాంతో భక్తులు అక్కడకి వెళ్లి రాళ్లను కదిపి తేళ్లను తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తారు. అలా చేయడం వల్ల తమకు అదృష్టం కలిసొస్తుందని భావిస్తారు.