మీరు ఎప్పుడైనా పింక్ డాల్ఫీన్స్ చూసారా..?

Suma Kallamadi
సముద్రమే ఒక వింత. అందులో ఎన్నో అద్భుతమైన వింతలు విశేషాలు దాగి ఉంటాయి. ఎన్నో రకాల జలచరాలకు సముద్రమే ఒక నిలయం. సముద్రంలో జీవించే జీవులను చూస్తే మన మనసంతా ఆనందంతో పులకరించి పోతుంది. సముద్రంలో వచ్చే అలలు చుస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.  తలచుకుంటేనే మనసులో పులకింత.సముద్రం పై భాగం మాత్రమే మనకి తెలుసు గాని సముద్రం అంతర్భాగాల్లో ఏమి ఉంటాయో మనకు తెలియదు.ఎన్నో రకరకాల జీవులు సముద్రాల్లో జీవిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీకో వింత డాల్ఫిన్ గురించి చెప్పాలనుకుంటున్నాము. సోషల్ మీడియాలో ఈ పింక్ కలర్ డాల్ఫిన్ వీడియో బాగా వైరల్ గా మారింది.ఏంటి పింక్ కలర్ డాల్ఫిన్ అని షాక్ అవుతున్నారా.. మనం ఇప్పటిదాకా డాల్ఫిన్లలో వైట్ కలర్, గ్రే, బ్లూ కలర్‌వి మాత్రమే చూశాం. కానీ పింక్ కలర్ డాల్ఫిన్లను చూడడం చాలా అరుదు అని చెప్పవచ్చు.

అయితే అది ఫేక్ వీడియో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ వీడియోను  సోషల్ మీడియాలో  షేర్ చేసినది IFS ఆఫీసర్ సుశాంత నంద కాబట్టి. ఆయనకు ఇలాంటి వాటి గురించి బాగా అనుభవం కలదు. కాబట్టి అది ఒరిజినల్ వీడియోనే అని మనం భావించవచ్చు. డాల్ఫిన్లు మనుషులకు బాగా మచ్చిక అవుతాయి . అలాగే అవి మనుషులలాగే బాగా తెలివిగా ఉంటాయి.  తెలివైనవి. మనతో ఆడతాయి. పిల్లలంటే డాల్ఫిన్లకు విపరీతమైన క్రెజ్.అయితే ఈ తాజా వీడియోను ఇప్పటికే 77వేల  మంది దాక చూశారు. చుసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా మాత్రం ఉండలేరు.

ఎందుకంటే ఈ వీడియో అందరికి నచ్చుతోంది కాబట్టి. ఈ డాల్ఫిన్ వీడియోకు  ఐదున్నర వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు వెయ్యి మంది మెసేజ్ చేసారు చాలా మంది ఈ  వీడియోను  చూసి భలే ఉన్నాయి డాల్ఫిన్స్ ముద్దుగా అని కామెంట్స్ పెడుతున్నారు.ఈ పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రాల్లోనే మాత్రమే మనకి కనిపించవు దక్షిణ అమెరికాలోని ఆమెజాన్ నదిలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే పై వీడియోలో మాదిరిగా కనిపించినంతబాగా పింకిష్ రంగులో అయితే కనిపించవు . ఇవి చాలా అరుదైనవి. ప్రతిసారి కనిపించవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: