ఇక ఈ మధ్య నడిరోడ్డుపై ఓ యువతీ ఓ క్యాబ్ డ్రైవర్‌ను కారులోంచి లాగి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన సంగతి అసలు మరిచిపోలేనిది. ఆ క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొట్టబోయాడనే కారణంతో పాపం ఆ డ్రైవర్ చెంపలపై చేయి చేసుకొని ఎడాపెడా వాయించింది ఆ యువతీ. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకోవడం జరిగింది.ఇక అప్పుడు ఏం జరిగిందంటే లక్నోలో వాహనాలు రద్దీగా ఉన్న రోడ్డులో ప్రియదర్శిని అనే ఈ యువతి రోడ్డు దాటుతుంది. ఇక ఆ సమయంలో సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్ తన కారుని జాగ్రత్తగా నడుపుకుంటూ ఆమెకు అతి సమీపంగా రావడం జరిగింది. ఇక అంతే కారుతో తనను ఢీకొట్టబోయిందని అతనిని క్యాబ్ నుంచి బయటకి లాగి మరీ అతనిపై చాలా దారుణంగా ప్రవర్తించి చేయి చేసుకోవడం జరిగింది.అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా కూడా ఆమె తన చేతివాటం ప్రదర్శించడం జరిగింది.
ఇక దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి అశాంతికి భంగం కలిగించారంటూ పాపం క్యాబ్ డ్రైవర్ సిద్ధీఖీపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ ఘటనపై ప్రియదర్శిని స్పందిస్తూ.. ఆ ‘క్యాబ్ డ్రైవర్ కారును జీబ్రా క్రాసింగ్ మీదకు పోనిచ్చాడు. ఇది ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం కాదా? సీసీటీవీ ఫుటేజీని ఒకసారి చూడండి. అప్పుడు తప్పెవరిదో తేల్చండి. ఒకవేళ నేను కారు ఢీకొని చనిపోయి ఉంటే చక్కగా పోస్టుమార్టం చేసి నా డెడ్‌బాడీని ఇంటికి పంపించేవారా..?’ అని ఆ యువతీ ప్రశ్నిస్తూ వాపోవడం జరిగింది.కాని నిజానికి ఆమె ట్రాఫిక్ రూల్స్ ని మీరినట్లు సీసి ఫుటేజ్ ద్వారా స్పష్టమవ్వడం జరిగింది.ఇక ఆమెని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు నెటిజన్స్. ఆమెని అరెస్ట్ కూడా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇలా ఆ యువతీ బాగా బ్యాడ్ అయ్యింది. ఇక తాజాగా రాఖీ పండగ సందర్బంగా అతనికి రాఖీ కడతానని చెప్పుకొచ్చింది. అతను అనుమతి ఇస్తే తన ఇంటికి పిలిపించి రాఖీ కడతానంటుంది ఈ యువతీ.మరి దీనిపై మీ స్పందన ఏమిటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.