దారుణం! మహిళను నగ్నంగా ఊరేగించారు.. ఎందుకంటే..?

Purushottham Vinay
సమాజంలో స్త్రీకి రాను రాను గౌరవం అనేది లేకుండా పోతుంది. కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే మహిళ చేసిన తప్పులకు చాలా దారుణంగా అవమానించి శిక్షిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జార్ఖండ్‌ రాష్ట్రంలోని డుమ్కా అనే జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఒక మహిళను వివస్త్రను చేసి, ఓ వివాహితుడితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఆమె మెడలో బూట్ల దండ వేసి మరి ఊరంతా ఊరేగించారని పోలీసు అధికారులు శనివారం ధృవీకరించడం జరిగింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలోని రాణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇక ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపడం జరిగింది.వీధిలో నగ్నంగా ఊరేగించబడిన మహిళ స్వయంగా వివాహం చేసుకుని ఆ వివాహితుడితో పరారీలో ఉన్నట్లు సమాచారం.


ఇక బుధవారం రాత్రి ఆమెను పట్టుకుని ఆ వ్యక్తి భార్య కుటుంబీకులు ఆమెని కొట్టారు.ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాలు ప్రకారం, ఆ మహిళ దుస్తులను విప్పేసి, ఆమె మెడలో బూట్లు వేసి ఆ గ్రామం అంతటా చాలా దారుణంగా నగ్నంగా ఊరేగించారు. ఇక గురువారం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో 12 మంది పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు, ఆ వ్యక్తి ఇంకా అతని భార్యతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు అని అధికారి చెప్పడం జరిగింది.అంతేకాకుండా, నిందితుడు తన వద్ద నుంచి రూ. 25,000 లాక్కున్నట్లు కూడా ఆ మహిళ పేర్కొనడం జరిగింది. ఇక ఈ కేసులో మిగిలిన ఆరుగురు నిందితులను కనుగొని అరెస్టు చేయడానికి పోలీసు అధికారులు ఇప్పుడు వారి ప్రయత్నాలను రెట్టింపు చేస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 148 (అల్లర్లు), 504 (శాంతి ఉల్లంఘనను ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 354b (దాడి), ఇంకా 379 (దొంగతనం) కింద FIR నమోదు చేసినట్లు పోలీసు అధికారులు ధృవీకరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: