వైరల్ : ఆయన తలపాగా రంగును బట్టే కారు సెలక్షన్...ఎందుకంటే...?
దీంతో రూబెన్ సింగ్ వారంలోని ఏడు రోజుల్లో ధరించే తలపాగాలను ఏ రంగులో ఉంటే ఆ రంగు కార్లలో తిరగడం చేశాడు. రోల్స్ రాయిస్ కార్లలో ప్రతి రోజూ తన తలపాగా రంగు కారుతో ఫోటోలను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతను బ్రిటన్ బిల్ గేట్స్ గా పేరుగాంచాడు. రూబెన్ సింగ్ ప్రయాణించే కార్లు చాలా ఖరీదైనవి. ఇవి ఆయన వద్ద 15కు పైగా ఉన్నాయి. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని రూబెన్ సింగ్ తన ఛాలెంజ్ ద్వారా నిరూపించాడు. తన తలపాగా పవర్ ఏంటో నిరూపించాలనుకుని ఈ పని చేసి ఛాలెంజ్ లో గెలిచాడు. తాను ఈ ఛాలెంజ్ లో విజయం సాధించడంపై రూబెన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.