1999వ సంవత్సరంలో భారత కార్గిల్ భూభాగాన్ని,
పాకిస్తాన్ తీసుకొని అక్రమం చేస్తున్న సమయంలో, భారత సైనికులు
పాకిస్తాన్ ఆర్మీ పై విరోచితంగా పోరాడి, మన కార్గిల్ భూభాగాన్ని వెనక్కి తీసుకువచ్చారు. ఆపరేషన్
విజయ్ పేరిట 1999 సంవత్సరం జులై 26వ తేదీన ఆపరేషన్
విజయ్ విజయవంతమైనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం 1999వ సంవత్సరం మే 3వ తేదీ నుంచి జులై 26వ తేదీ వరకు.. కార్గిల్ జిల్లాలో వాస్తవాధీన
రేఖ సమీపంలో
భారత్ అలాగే
పాకిస్తాన్ ఆర్మీ ల మధ్య ఒక యుద్ధమే జరిగింది. ఇక ఈ యుద్ధానికి పెట్టుకున్న పేరు ఆపరేషన్ విజయ్. రక్తం గడ్డకట్టుకుపోయే ప్రదేశంలో, ఏమాత్రం సహకరించని శరీరంతో ఎంతో పోరాడి , సుమారు 60 రోజుల పాటు ఒళ్ళు గగుర్పొడిచేలా ఒక భీకర యుద్ధం జరిగింది. ఇందులో భారత దేశానికి చెందిన సుమారు 527 మంది సైనికులు వీరమరణం పొందారు.
ఇక వీరమరణం పొందిన 527 మందిని మనం ప్రతి సంవత్సరం గుర్తుంచుకునేలా జులై 26వ తేదీ ని కార్గిల్
విజయ్ దివాస్ గా ప్రకటించడం జరిగింది. మన దేశాన్ని ఇతరుల ఆక్రమణలకు బలి కాకుండా, మన దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని సైనికులకు.. మనం ఏం చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రోజు మనం హాయిగా నిద్ర పోతున్నాము అంటే అక్కడ వారి శ్రమే ఈరోజు మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాము. అందులో మనం చెప్పుకోదగిన 10మంది సూపర్ హీరోస్ గురించి ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.
1. కెప్టెన్
విక్రమ్ బాత్రా :
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాలంపూర్ లో కమల కాంత - గిర్ధారీ లాల్ బాత్రా దంపతులకు 1974
సెప్టెంబర్ 9వ తేదీన జన్మించాడు. ఇతను 1996వ సంవత్సరం
జూన్ లో మానెక్షా బెటాలియన్ IMA లో చేరాడు. జమ్మూ
కాశ్మీర్ రైఫిల్స్ లో 13 వ బెటాలియన్ కింద లెఫ్టి నెంట్ గా నియమింపబడ్డారు. అయితే ఈయన ఆపరేషన్
విజయ్ లో పాల్గొని అమరులయ్యారు. ఇక ఈయన మరణం తర్వాత భారత ప్రభుత్వం " పరమ్ వీర్ చక్ర" బిరుదుతో గౌరవంగా సత్కరించింది.
2. గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్:
ఈయన మే 10వ తేదీ 1980వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని, బులంద్ షహర్ సమీపంలో ఉన్న సికింద్రబాదులో సంతారా దేవి -
కరణ్ సింగ్ యాదవ్ దంపతులకు జన్మించాడు. ఇక 1999
జూన్ 12వ తేదీన ఆపరేషన్
విజయ్ లో వీరమరణం పొంది, అతి చిన్న వయసులోనే పరమవీరచక్ర బిరుదును పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
3. లెఫ్టినెంట్ మనోజ్
కుమార్ పాండే:
ఈయన 1975వ సంవత్సరం
జూన్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్, సీతాపూర్ సమీపాన రుధా గ్రామంలో మోహిని పాండే,
శ్రీ గోపీచంద్ పాండే దంపతులకు జన్మించారు. ఈయన ఆర్మీలోకి అత్యున్నత పురస్కారం అయిన పరమవీరచక్ర బిరుదును పొందాలనే , లక్ష్యంతోనే సైన్యంలో చేరాడు. కార్గిల్ యుద్ధంలో భీకర పోరాటం చేసి అమరులైన ఈయనకు మరణానంతరం పరమ వీర చక్ర బిరుదు లభించడం జరిగింది.
4. లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్:
1973 సంవత్సరం
అక్టోబర్ లో హర్యానాలోని
రోహ్తక్ జిల్లాలో, సశ్రౌలి గ్రామంలో జన్మించాడు. 1999 జూలై మూడవ తేదీన ఫిరంగి దాడులకు బలయ్యాడు. ఇక ఈయన మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు
మహా వీర చక్ర బిరుదుతో సత్కరించింది.
5. మేజర్ రాజేష్ సింగ్ అధికారి:
1970 సంవత్సరం
ఉత్తర ప్రదేశ్ నైనిటాల్ లో జన్మించారు. ఈయన తల్లి మాళ్తి అధికారి,
తండ్రి కే ఎస్ అధికారి. ఇక ఈయన కార్గిల్ యుద్ధంలో 1999 వ సంవత్సరం మే 30వ తేదీన స్వర్గస్తులయ్యారు. ఈయనకు మహావీరచక్ర బిరుదుతో సత్కరించడం జరిగింది.
6. రైఫిల్మన్ సంజయ్ కుమార్:
1976 మార్చిలో
హిమాచల్ ప్రదేశ్ లో జన్మించారు. ఇక ఆపరేషన్
విజయ్ భీకరయుద్ధంలో 1999 జులై 4వ తేదీన మరణించారు. ఇక ఈయన చనిపోయిన తర్వాత పరమవీరచక్ర బిరుదుతో సత్కరించారు.
7. మేజర్
వివేక్ గుప్తా:
డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఈయన
జూన్ 13 1999 వ తేదీన వీర మరణం పొందారు. ఇక ఈయన మరణానంతరం మహావీర చక్ర బిరుదును ఇచ్చారు.
8. కెప్టెన్ ఎన్. కెంగురుసే:
నాగాలాండ్ , కొహిమ జిల్లాలో 1974 జూలై లో జన్మించారు. ఇక ఆపరేషన్
విజయ్ లో 1999
జూన్ 28 వ తేదీన వీరమరణం పొందారు .ఈయనకు
మహా వీర చక్ర బిరుదుతో మరణానంతరం సత్కరించడం జరిగింది.
9. లెఫ్టినెంట్ కీషింగ్ క్లిఫోర్డ్ నోంగ్రం :
మేఘాలయ షిల్లాంగ్లో 1975
మార్చి లో జన్మించారు. కార్గిల్ యుద్ధంలో భీకర మరణం పొందడంతో మరణానంతరం ఈయనకు
మహా వీర చక్ర బిరుదును అందించారు.
10.
నాయక్ దిగేంద్ర కుమార్:
1969 జూలై లో జన్మించాడు.
రాజస్థాన్ కు చెందిన ఈయన 1999
జూన్ 13వ తేదీన ఆపరేషన్
విజయ్ లో యుద్ధం చేసి మరణించారు. ఇక చనిపోయిన తర్వాత ఈయన కు భారత ప్రభుత్వం మహావీర చక్ర బిరుదును అందించింది.