ప్రత్యేక వాయిస్ లతో అలెక్సా..ఇకపై పురుష గొంతుతో..

Divya
అలెక్సా.. అమెజాన్ 2014 నవంబర్ లో ప్రారంభించినప్పటి నుంచి మనకు వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ ను కేవలం ఆడ గొంతుతో మాత్రమే వినిపించేది. అయితే ఇప్పుడు సరికొత్తగా మగ గొంతుతో వినిపించడానికి అలెక్సా రెడీ అయింది. అయితే ది వెర్జ్ అనే నివేదిక ప్రకారం అమెజాన్ జిగ్గీ అనబడే ఒక కొత్త వేక్ పదాన్ని పరిచయం చేసింది. ఈ జిగ్గి వినియోగదారులకు , పురుష స్వరంతో ఎంపిక చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా అలెక్సా లో ఒరిజినల్ వాయిస్ ఆడగొంతు తో ఉండగా, ఇప్పుడు కొత్త వాయిస్ అయిన మగ గొంతు ను కూడా ఆడ్ చేయడం జరిగింది.

ఇక అంతే కాదు అలెక్సా లో క్రొత్త లేదా ఒరిజినల్ అనే ఈ రెండు వాయిస్ లను ఎంపిక చేసుకోవడానికి, వినియోగదారులకు ఇందులో ఒక సెట్టింగ్స్ ని కూడా అమర్చడం జరిగింది. మీకు ఆడ గొంతు కావాలన్నా లేదా మగ గొంతు కావాలన్నా, అలెక్సా ను మీరు వాయిస్ ను  మార్చమని అడగవచ్చు. ఇక ఈ కొత్త వాయిస్ ను అలెక్సా లో మీరు పొందడానికి " అలెక్సా మీ గొంతు మార్చండి.." అని కూడా వినియోగదారు అడగవచ్చు. అప్పుడు డిజిటల్ అసిస్టెంట్ అందులో ఉన్న ఆడ, మగ అనే వాయిస్ మారుస్తుంది.

ఇక అంతే కాదు అలెక్సా లో గొంతు మార్చాలి అంటే, సెట్టింగ్స్ మెనూ లోకి వెళ్లి కూడా వాయిస్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు అలెక్సా లో ఈ సరికొత్త మార్పు ఎందుకంటే.. ఇప్పటికే ఆపిల్ అలాగే గూగుల్ రెండూ కూడా తమ సహాయకులైన గూగుల్ అసిస్టెంట్ ల కోసం, రకరకాల వాయిస్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెజాన్  కూడా కొంచెం ఆలస్యం అయినప్పటికీ ,ఈ మార్పును తీసుకువచ్చింది. అయితే ఈ వాయిస్ లకు భౌతిక శరీరం కానీ లింగ గుర్తింపు కానీ ఏమీ లేదు. కేవలం అమెజాన్ సంస్థల నైపుణ్యాలను సూచించడం కోసమే దీనిని సృష్టించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
అలెక్సా జిగ్గి ప్రస్తుతం యూఎస్ లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక త్వరలోనే ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అమెజాన్ సంస్థ తెలపడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: