నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రాఫిక్ పోలీసుల మీమ్...

Purushottham Vinay
సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త ట్రెండ్‌ని సెట్ చేసి సాధారణ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. సోషల్ మీడియాను తమ స్టైల్ లో వాడేస్తూ వాహనదారులను నవ్విస్తూనే వాళ్ళను ఆడుకుంటున్నారు. ప్రొఫెషనల్ మీమర్స్ లాగానే హైదరాబాద్ పోలీసులు కూడా ఫన్నీగా మీమ్స్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించిన వారి భరతం పడుతున్నారు. ఇక ఈ ఫన్నీ మీమ్స్‌తో ఓ వైపు ట్రాఫింక్ ఉల్లంఘనలను భారీ తమ జరిమానాలతో హడలెత్తిస్తూనే మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలంటే భయపడేలా వాహనదారులను బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కెమెరాకు చిక్కడమే ఆలస్యం.. ఆ ఫోటోను పోలీసులు ఓ రేంజ్‌లో తెగ వాడేసుకుంటున్నారు.
ఇక తాజాగా అలాంటి మీమ్‌నే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇక ఈ ఫన్నీ మీమ్ నెటిజన్లను ఎంతగానో అకట్టుకుంటూ నవ్విస్తుంది.ఇక అదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన కల్పిస్తోంది.ఇక అసలు విషయానికి వస్తే..సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువకులు కనీసం హెల్మెట్ కూడా లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇక స్కూటీ నడుపుతున్న ఓ యువకుడు అయితే ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మరో చేత్తో ఫోన్ మాట్లాడుతున్నాడు.ఇక మధ్యలో ఉన్న యువకుడు సైతం ఫోన్‌లో మాట్లాడుతూ తెగ నిమగ్నమై ఉన్నాడు. ఇక చివర కూర్చున్న యువకుడు మహా ముదురులా మారి ఏదో చేయబోయాడు. కానీ అడ్డంగా బైక్ ఓనర్ ని బుక్ చేశాడు. ట్రాఫిక్ పోలీసుల చలాన్ నుంచి తప్పించుకునేందుకు తన కాలిని స్కూటీ నెంబర్ ప్లేట్‌కి అడ్డుగా పెట్టాడు ఆ కుర్రాడు. అయితే, పోలీసులు మాత్రం ఆ యువకుడికి ఝలక్ ఇస్తూ.. ఆ స్కూటీ ఓనర్‌కు మరిచిపోలేని సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఒక్కొక్క ఉల్లంఘనను పేర్కొంటూ ఆ స్కూటీ ఓనర్ కి భారీ జరిమానాని విధించారు. ఇక మొత్తంగా 3,200 రూపాయల చలాన్ ఆ యువకుడికి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: