పెళ్లి కొడుకుని చెప్పుతో కొట్టిన తల్లి...
ముఖానికి ముసుగు వేసుకుని ఉండటం వల్ల ఆ మహిళ ఎవరో తెలియలేదు.ఇక ఈ సంఘటన జరగగానే కొందరు ఆమెను బలవంతంగా స్టేజ్ మీద నుంచి కిందికి దించేయడం జరిగింది.ఆ మహిళ మరెవరో కాదట .. సాక్షాత్తు ఆ పెళ్లి కొడుకు తల్లేనని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే, కొత్త దంపతులను ఆశీర్వదించాల్సిన ఆమె ఎందుకలా చేసిందో అర్థం కాలేదు.పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు సమాచారం ప్రకారం.. కొడుకు వేరే కులానికి చెందిన అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదట. దీంతో ఆమె కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.ఇక అప్పటి నుంచి అతడు ఆ యువతితోనే కాపురం చేస్తున్నాడట. అయితే పెళ్లికూతురు తండ్రి తన కూతురి పెళ్లిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డిస్ట్రిక్ట్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు కుటుంబికులను కూడా ఆయన ఆహ్వానించాడు. దీంతో పెళ్లి కొడుకు తల్లి ఆ వేదిక వద్దకు వచ్చి కొడుకు మీద ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు. కులపిచ్చితో కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకోలేని నువ్వు తల్లివేనా? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.