వైరల్ : ఈ అమ్మాయిలకు ఏమైంది అబ్బా...?
అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమోగా గానీ.. మొత్తానికి వారంతా రోడ్డుపై రెజ్లర్స్ లాగా మారిపోయి భీకరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు యువతులు ఏకంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతలో వీరికి మరో యువతి ఎడురుపడటం ఆ తర్వాత వారంతా ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు. దీంతో అప్పటి దాకా బాగానే ఉన్న వీరంతా ఒక్కసారిగా సీన్ మారి చివరకు ఫైట్ సీన్ గా మారి పోతుంది. దీంతో ఆ ఇద్దరు యువతులు మాత్రం మూడో యువతిపై దాడికి దిగుతూ రు. ఇష్టమొచ్చినట్లు తన్నుకుని చివరకు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు.
ఇక ఆ ఇద్దరు యువతుల పవర్‌కు మూడో యువతి మొదట షాక్ తిన్నా కూడా అంతలోనే తేరుకుని తానేం తక్కువా అటూ ఆమె కూడా వారిని తిరిగి కొట్టడం మొదలుపెట్టి చివరకు రచ్చ రచ్చ అవుతుంది. ఇది చూసిన అక్కడున్న వారంతా వింతగా నిలబడి వీడియోలు తీయరం కామన్ అయిపోతుంది. అయితే ఆ యువతులను ఆపేందుకు మాత్రం ఏ ఒక్కరూ కూడా సాహసించకపోవడం ఇక్కడ ట్విస్టు అనే చెప్పాలి. వీరంతా ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ తన్నుకుంటూ ముగ్గురు ఒకరిది ఒకరు జుట్టు పీక్కుంటూ కొద్దిసేపు నడిరోడ్డు మీద బీభత్సం సృష్టించారనే చెప్పాలి.