వైరల్ వీడియో.. వధువుని ఎత్తుకొని నది దాటిన వరుడు..

Purushottham Vinay
మాములుగా పెళ్లిలో వధువును బుట్టలో పెట్టుకొని తీసుకొచ్చే సంప్రదాయం మన దేశంలో చాలా చోట్ల ఉంటుంది.పెళ్లికూతురు మేనమామ అలా తీసుకొస్తాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. ఏంటంటే..బీహార్‌లోని కిషన్ గంజ్‌లో ఓ పెళ్లి కొడుకు తాను పెళ్లాడిన వధువును తమ ఇంటికి ఎత్తుకొని తీసుకురావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దఇది ఏమాత్రం సంప్రదాయమో.. లేక కొత్తగా ఉండాలన్న ఆకాంక్షో కారణం కానే కాదు. దీనికి అసలైన కారణం ఓ నది వరదట. కిషన్ జంజ్‌లోని సింధిగ్ మారి ఘాట్ ప్రాంతంలో ఇది జరిగింది. అక్కడ భారీ వర్షాల కారణంగా ఇక్కడి కన్కాయ్ నదికి వరదలు బాగా వచ్చాయి. ఇక దీంతో భారీ ప్రవాహంతో ఈ ప్రదేశం మొత్తం కూడా నీటితో పూర్తిగా నిండిపోయింది.ఇక అదే సమయంలో పెళ్లి కొడుకు శివ్ కుమార్ తన బంధువులతో కలిసి నదికి అవతలి వైపు ఉన్న పాల్సా ప్రాంతం నుంచి పెళ్లి చేసుకొని తిరిగి వస్తున్నాడు.వివాహ వేడుక పూర్తయ్యాక వధువు, వరుడు, బంధువులు పడవలో సింధిగ్ మారి ఘాట్‌కి చేరుకున్నారు. కానీ అక్కడ నది ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఘాట్‌లో ఇసుక మేటలు వేసింది. ఇక ఆ ఇసుకలో అక్కడ పడవ ఇరుక్కుపోయింది. దాంతో అందరూ దిగి నడుచుకుంటూ వెళ్లమని పడవ నడిపే వ్యక్తి చెప్పాడు.ఇక చేసేది లేక బంధువులంతా పడవ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక అక్కడ నీటిలోంచి నడుచుకుంటూ వెళ్లడం తప్ప మరే అవకాశం లేదు.అందుకే తన భార్యను భుజాలపై ఎత్తుకొని గట్టు దగ్గరికి తీసుకురావాలని అతను భావించాడు.


కన్కాయ్ నదిపై సింధిగ్ మారి దగ్గర బ్రిడ్జి కట్టాలన్న ప్రపోజల్ పది సంవత్సరాల నుంచి ఇంకా అలాగే ఉందట.దీంతో కిషన్ గంజ్ చుట్టు పక్కల జిల్లాలకు చెందిన వాసులందరు కూడా ఈ నదిని దాటేందుకు పడవల సాయం తీసుకోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవట్లేదు అంటూ వరుడి బంధువు రాహుల్ సింగ్ విమర్శించారు.అన్ని ఊర్లకు రోడ్లను వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇక్కడ మాత్రం వేయలేదని.. ఈ నది వల్ల తమ జిల్లాలు మిగిలిన ప్రపంచంతో ఏమాత్రం సంబంధాలు లేకుండా అయిపోయాయని అక్కడి జనాలు ఆవేదనను వెల్లడిస్తున్నారు. ఇక వీరు ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం పడవలే ఆధారం. ఇక వానా కాలంలో వరదలు వచ్చినప్పుడైతే ఎక్కడికీ వెళ్లేందుకు వీలు కాక  తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా ఇలా నదిలో నడుస్తూ వెళ్లడమనేది ప్రమాదకరంగా మారింది.




https://youtu.be/4Njbr7GZt38

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: