సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఎంతకాలం గడపగలరు? కరోనా దెబ్బకు ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నాం కదా అనుకుంటున్నారేమో.. మనం కరోనా భయంతో బలవంతంగా ఇంట్లోనే ఉన్నాం కానీ స్వచ్ఛందంగా అయితే కాదు. అసలెవరైనా సరే ఇలా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధాన్ని కోరుకుంటారా? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలిసిందే. అదీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా పది సంవత్సరాలు నుంచి ఓ వ్యక్తి ఇలా ఇంటికే పరిమితమైపోయాడు. ఇక అతని విషయానికి వస్తే అతను జపాన్ వాసి. అతని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక జపనీస్ పదానికి అర్థం తెలుసుకోని తీరాలి. ఇక ఆ పదం ఏంటంటే ‘హికికోమోరి’ (Hikikimori). హికికోమోరి అర్థం ఏంటంటే సమాజం నుంచి దూరంగా ఉండటం, ఇంకా ఒంటరితనాన్ని ఇష్టపడటం, స్వీయ నిర్బంధాన్ని కోరుకోవటం అని అర్థం వస్తుంది. ఈ పద్ధతిని ఒక పది సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నాడు జపాన్‌కు చెందిన నీటో సౌజీ.
టోక్యోకు చెందిన ఇతను పదేళ్ళ నుంచి హికికోమోరిగా జీవిస్తున్నాడు. ఇక మూడునెలలకోసారి మాత్రమే హెయిర్ కటింగ్ కోసం ఇతను బయటకు వస్తాడు. ఇక అంతకు మించి అపార్ట్‌మెంట్ నుంచి అస్సలు బయటకు రాడట. తన పనికోసం దూర ప్రాంతానికి వెళ్ళిన సౌజీ.. పదేళ్ల క్రితం తన స్వస్థలం టోక్యోకు తిరిగివచ్చాడు. ఇక అప్పటి నుంచి సౌజి అతని అపార్ట్‌మెంట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈయన షాపింగ్ విషయానికి వస్తే అంతా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తాడు. అలాగే కిరాణా సామాగ్రి ఇంటికే వచ్చే ఏర్పాటు కూడా చేసుకున్నాడు సౌజి.జపాన్‌లో ఇలా సుమారు 5 లక్షల మంది యువత, మరో 5 లక్షల మంది వృద్ధులు స్వీయ నిర్బంధాన్ని కోరుకునేవారిలో ఉన్నారని తెలిసింది.ఇక ఇలాంటి వారిలో సౌజీ నెంబర్ వన్ గా ఉన్నాడు. సౌజీ ఇతరుల లాగానే తన సాధారణ జీవితాన్ని గడుపుతాడు. అయితే అదంతా బయట కాదు. ఓన్లీ అపార్ట్‌మెంట్ లోపల మాత్రమేనట.