ఈ మధ్య కాలంలో కొన్ని వింత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో అందరు భయం తో వణికి పోతున్నారు.. కానీ కొంతమంది మాత్రం వింత కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు జనాలను ఆలోచనలో పడేస్తున్నారు. కానీ కొందరు మాత్రం వింత పనులు చేస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. నిత్య పెళ్ళిళ్ళు చేసుకుంటూ దర్జాగా ఉన్నారు.. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్ళి చేసుకోవడం ఒకటి.. ఒకే పందిరి లో ఇద్దరినీ పెళ్ళి చేసుకోవడం ఎప్పుడూ చూసి ఉండరు.. ఇప్పుడు ఆ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..
ఆదిలాబాద్ జిల్లాలో వింత పెళ్లి వెలుగు లోకి వచ్చింది. ఒకే మండపం లో ప్రేమించిన ఇద్దరినీ ఒకేసారి తాళి కట్టారు ఓ యువకుడు..ఇద్దరు యువతుల కుటుంబాన్ని ఒప్పించాడు. ఈ పెళ్ళికి వాళ్ళు కూడా ఒప్పుకోవడం తో అతడి ఆనందానికి అవధులు లేవు..ఈ విషయాన్నీ గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. మొదట్లో ఒప్పుకోకున్నా తర్వాత అర్థం చేసుకొని ఈ పెళ్ళికి అనుమతిని ఇచ్చారు. దాంతో ఊరందరి నడుమ ఈ పెళ్లి ఘనంగా జరిగింది.
విషయానికొస్తే.. ఉట్నూర్ మండలం ఘనపూర్ చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు.. ఈ క్రమం లో ఖాళీగా ఎందుకు అనుకున్నాడో ఏమో తన మేనత్తల కూతుర్లను లైన్లో పెట్టాడు. మూడేళ్ళ పటు ఒకరికి తెలియకుండా మరొకరి తో ప్రేమ పాఠాలు నేర్చుకున్నాడు. ఈ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళు ఈ విషయాన్నీ గ్రామా పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సూర్యకళ, ఉషా రాణిని అర్జున్ కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.వాళ్ళ సంప్రాదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం ఈ నెల 14 న జరిగింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.