సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక
కరోనా కల్లోల సమయంలో కూడా మీకు నేను అండగా వున్నాను.. అధైర్య పడకండి అంటూ జనాలకు భోరోస ఇస్తున్న రియల్ హీరో ను కలవడానికి హైదరాబాద్ యువకుడు సాహసమే చేశాడు. ఏకంగా 700 కిలోమీటర్లు నడిచి సోనూసూద్ ను కలిశాడు.. ఫైనాన్స్ చెల్లించక పోవడంతో తన తండ్రి ఆటోని ఫైనాన్స్ వాళ్ళు లాక్కెళ్లిన విషయం... తల్లి మరణంతో ఒంటరైన తమ జీవితాలకు భరోసా ఇవ్వాలని సోను సూద్ దృష్టికి తీసుకెల్లే ప్రయత్నం చేశాడు.
హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు సోనూసూద్ ని కలవడానికి గత నెలలో హైదరాబాద్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాడు. నా లక్ష్యం నా దేవుడిని కలవడం అంటూ నడక సాగించాడు. 700 కిలోమీటర్ల సుదీర్ఘ నడక ప్రయాణం తర్వాత హీరో నీ కలిసి తన అభిమానాన్ని చాటాడు. తాను ఇంత సాహసం చేయడానికి గల కారణాలను సోనుకి చెప్పాడు. కాగా తనను కలవడానికి ఇలాంటి సాహసాలు ఎవరూ చేయకండి అంటూ సోనూసూద్ సూచించారు.