28 మంది భార్యలతో 37వ పెళ్లి చేసుకున్న ఘనుడు...

Purushottham Vinay
పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక మనిషికి అదే ముఖ్యమైన ఘట్టం.ఇక ఒక సామెత కూడా వుంది. అదే పెళ్లంటే నూరేళ్ల ‘పంట’ అంటారు మన పెద్దలు. అయితే.. మరి ఈ ముసలాయన దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో ఏమో గాని గత కొన్నాళ్లుగా వరుసగా పెళ్లిల్లు చేసుకుంటూ ‘నూరేళ్లు’ వరకు పంటలు పండించే విధంగా చేస్తున్నాడు. ఈ రోజుల్లో అస్సలు మంచి వయస్సు ఉండి కూడా పెళ్లి కాక నానా తంటాలు పడుతుంటే..ఈ ముసలాయన మాత్రం ఏకంగా 36 పెళ్లిల్లు చేసుకున్నాడు.ఇక తన పెళ్ళాల ముంగిటే తాజాగా 37వ పెళ్లి చేసుకుని మరోసారి షాక్ ఇచ్చాడు.


ఇక అన్ని పెళ్లిళ్లు చేసుకున్న ఈ మహానుభావుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం కాటికి కాలుచాపిన ముసలాయన తన 28 మంది భార్యలు చూస్తూ ఉండగా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఎంతో సహనంగా చేసిన సంసారం కారణంగా ఈ ముసలాయనకి 35 మంది పిల్లలు పుట్టారు. వాళ్లకు దాదాపు 126 మంది పిల్లలు, మనవళ్లు కూడా ఉన్నారట. వీళ్లంతా కూడా ఆ ముసలాయనకు మనవళ్లు మునిమనవళ్లు అవడం విశేషం.


ఇక నాగాలాండ్‌ ఐసీఎస్ అధికారి రుపిన్ శర్మ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. కేవలం 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఉన్న ముసలాయన అక్కడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు చెవిలో తన ఇష్టాన్ని వ్యక్తం చేయడంతో పెళ్లి తంతు ముగిసిపోవడం జరిగింది.ఇక ఈ సందర్భంగా ఆ పెళ్ళిలో ఆ ప్రాంతం వారు చప్పట్లు, కేరింతలతో ముసలాయన పెళ్లిని బాగా వీక్షించారు. ఇక ఈ పెద్ద మనిషి వీడియో చూసిన నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు చూసి మీ స్పందన తెలియజేయండి.
Your browser does not support HTML5 video.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: