ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?
వెనకాల నిలబడి ఒక వ్యక్తి బోరింగ్ కొడుతూఉంటే ఇక ముందు పంపు లో నుంచి వచ్చే నీటిని తాగుతూ ఉండే వారూ. ఇది మనం అందరం ఇప్పుడు వరకు చూసే ఉంటాం. కానీ ఒక ఏనుగు అచ్చం మనిషిలాగే బోరింగ్ కొట్టుకొని నీళ్లు తాగడం ఎప్పుడైనా చూసారా. ఏ ఊరుకోండి బాసు.. ఏనుగుకి బోరింగ్ కొడితే నీళ్లు వస్తాయి అని ఎలా తెలుస్తుంది అని అంటారా.. ఎలా తెలిసిందో తెలియదు కానీ...ఇక్కడ మాత్రం ఒక ఏనుగు ఇదే చేసింది. పాపం ఆ ఏనుగుకి ఎంత దాహం వేసిందో ఏమో.. ఇక మనిషి లాగానే అచ్చంగా బోరింగ్ కొట్టి తన దాహం తీర్చుకుంది ఏనుగు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కమలాపూర్ ఏరియాలో చాలా ఏనుగులు ఉంటాయి. అయితే సమీపంలో ఉన్న పెద్ద సరస్సులో నీళ్లు తాగుతూ ఉంటాయి ఏనుగులు. కానీ ఏనుగుల గుంపు లో రూప అనే ఏనుగు ఉంది. పెద్ద సరస్సు లో ఉన్న నీటిని వదిలేసి ఏకంగా ఒక బోరింగ్ దగ్గర నీళ్లు తాగడానికి వచ్చేసింది. ఇక బోరింగ్ కొడితే నీళ్లు వస్తాయని ఈ ఏనుగుఎలా తెలుసుకుందో తెలియదు కానీ అచ్చం మనుషుల్లాగానే బోరింగ్ కొట్టి నీళ్లు తాగి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఏనుగు. కొన్ని కొన్ని సార్లు ఈ ఏనుగు ఇలాగే వచ్చి బోరింగ్ కొట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది అంటూ తెలుపుతూ అటవీశాఖ అధికారులు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది చూసి నేటిజన్లు అవాక్కవుతున్నారు.