
వావ్! బుడ్డపిల్ల మెమొరీ పవర్ మాములుగా లేదుగా...
ఇక వీడియోలో గమనించినట్లయితే ఆ వీడియో లో ఆ పాపని వాళ్ళ అమ్మగారు అనేక దేశాల పేర్లు చెబుతుంటే ఆ చిన్న పిల్ల ఏమాత్రం తడుముకోకుండా చక చక ఆ దేశాల రాజధానులు పేర్లు చెప్పేసింది.అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 205 దేశాల రాజధానుల పేర్లు మరిచిపోకుండా చెప్పింది. ఇది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి.ఇక ఆ చిన్న పిల్ల మెమోరి పవర్ కి నెటిజన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు. నిజంగా ఆ పిల్ల మెమోరి పవర్ కి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే ఇంత తెలివిగా యాక్టీవ్ గా ఉంటే పెద్దయ్యాక ఈ పిల్ల ఇంకా తెలివి గల అమ్మాయి అవుతుందని వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోలో వున్న పాప విషయానికి వస్తే ఆ పాప పేరు ప్రణీన. ఈ పాప వయస్సు కేవలం 2 సంవత్సరాల 6 నెలలు.ఇక ఈ పాప వీడియోని ప్రియాంక శుక్ల అనే ఐఎయస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పాప తన కొలీగ్ ప్రదీప్ టాండన్ కూతురట. తన మెమోరి పవర్ కి ఫిదా అయ్యి ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ తెగ వైరల్ పలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తుంది.