స్విమ్మింగ్ పూల్లో జంట..ఏనుగు చేసిన అల్లరి వైరల్
ఆ సమయంలో ఆ పూల్లో ఓ జంట స్నానం చేస్తోంది. అనుకోని అతిథి వచ్చేసరికి వాళ్లు షాక్ అయ్యారు. "వామ్మో అడవి ఏనుగు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, కదిలితే అది వెంట పడుతుందేమో. పారిపోదామంటే, ఒంటిపై బట్టలు లేవు. అది ఏం చేస్తుందో, ఏమో ఇలా బుక్కైపోయామేంటి" అని ఆ జంట టెన్షన్ పడింది. ఏనుగు ఆ జంటను పరీక్షగా చూసింది. ఆ జంట కదలకుండా బొమ్మల్లా ఉంది. ఏనుగు నీటిలో తొండాన్ని పెట్టి గుడగుడగుడగుడ అంటూ నీటిని తొండంలోకి లాక్కొని నోట్లోకి పంపుకుంది. ఇలా 2సార్లు చేసింది. ఆ జంట భయంభయంగా చూడసాగింది. దాహం తీర్చుకున్నాక ఏనుగు మరోసారి ఆ జంట వైపు అదోలా చూసింది. ఆ జంట "ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్" అని బతిమలాడుతున్నట్లు ఉంది. ఏనుగు వారిపై జాలి పడి వదిలేసి తన దారిన తాను అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. 2010లో జరిగిన ఈ ఘటన యూట్యూబ్లో ఇప్పుడు వైరల్ అవుతోంది.