ఇదెక్క‌డి సాంప్ర‌దాయం మావా..సంత‌లో అమ్మాయిలు..శ‌వాల‌తో పెళ్లిల్లు... !

MADDIBOINA AJAY KUMAR
ప్రాంతాలు మారేకొద్దీ జీవన‌విధానాలు మారుతుంటాయి..ఆచార వ్య‌వ‌హారాలు, సాంప్ర‌దాయాలు సైతం మారుతుంటాయి. మ‌న దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్ర‌దాయం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా ప్ర‌పంచంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్ర‌దాయం క‌నిపిస్తుంది. ఇక ముఖ్యంగా పెళ్లి విష‌యంలో అయితే ఊరికో తీరు అన్న చందంగా ఉంటుంది. పెళ్లి చూపుల నుండి మొదలుకుని శోభ‌నం వ‌రకూ ఎవ‌రి క‌ల్చ‌ర్ వారిదే. అయితే ద‌క్షిణాఫ్రికాలోని సూడాన్ లో మాత్రం సాంప్ర‌దాయాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం..మ‌న‌దగ్గ‌రైతే అమ్మాయిలు క‌ట్నం ఇచ్చి న‌చ్చ‌న అబ్బాయిని కొనుక్కుంటారు. కానీ సూడాన్ లో అలా కాదు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఎదురుక‌ట్నం ఇవ్వాల్సిందే. అంతే కాకుండా మ‌న‌లా వాళ్ల‌కి ఇంట్లో పెళ్లి చూపులుండ‌వు. అమ్మాయిను సంత‌లో వేలం పెడ‌తారు. అబ్బాయిలు ఆ సంత‌కు వెళ్లి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఎవ‌ర‌కు ఎక్కువ వేలం పాడితే వారికే ఆ అమ్మాయి చెందుతుంది. 


ఇలా దక్షిణ సూడాన్ లోని ఓ వ్యాపార వేత్త పెళ్లి కోసం 500 ప‌శువులు రెండు కార్లు మ‌రి కొంత డ‌బ్బు ఇచ్చి వ‌ధువును ద‌క్కించుకున్నాడ‌ట‌. ఇదిలా ఉండ‌గా సూడాన్ లోనే మ‌రొక ద‌రిద్ర‌మైన సాంప్ర‌దాయం కూడా ఉంది. అదికూడా ఇప్పుడు చూసేద్దాం. అత్యంత పేద కుటుంబానికి చెందిన యువ‌తులకు ద‌క్షిణ‌సూడాన్ లో పెళ్లిల్లు జ‌ర‌గ‌వంట‌. దాంతో యువ‌త‌లను శ‌వాల‌కు ఇచ్చి వివాహాలు జ‌రిపిస్తార‌ట‌. అయితే స‌మయానికి శ‌వాలు ఎలా దొరుకుతాయనే అనుమానం రావ‌చ్చు. అక్క‌డ ముందుగానే చావుకు ద‌గ్గ‌ర‌లో ఉన్న వ్య‌క్తి కుంటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుకుంటార‌ట‌. చనిపోయిన త‌ర‌వాత మా కూతురును ఇచ్చి వివాహం జ‌రిపించాల‌ని...అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత ఆ వ‌ధువుకు చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రితో అయినా శోభ‌నం జ‌రిపిస్తార‌ట‌. కానీ ఆ వ్య‌క్తితో యువ‌తికి ఎలాంటి సంబంధం ఉండ‌దు. యువ‌తిని కూడా వితంతువులా భావించ‌రు. ఈ ద‌రిద్ర‌మైన సాంప్ర‌దాయానికి ఇప్పుడిప్పుడే సూడాన్ మ‌హిళ‌లు చెక్ పెడుతున్నార‌ట‌. శ‌వాల‌తో పెళ్లిల్లు చేసుకోబోమ‌ని తెగేసి చెబుతున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: