వారెవ్వా.. ఏం తెలివి భయ్యా..

Satvika
ఎవరికైనా చావు వరకు వెళితే తెలివితేటలు ఎక్కువ అని అంటారు. అది నిజమేనని ఇప్పుడు అనిపిస్తుంది. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మనుషులకు సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. అవి కాస్త ట్రెండ్ అవ్వడం తో పాటుగా వైరల్ అవుతున్నాయి.. ఈ మహమ్మారి ఒకసారి వచ్చిందంటే ప్రాణాలను వదిలేయడం పక్కా.. అయితే,కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే.. వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ఇలా తనకు సోకిన కరోనా బంధువులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో, ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో తనకు సోకిన కరోనావైరస్ తన ఇంట్లోవాళ్లకు కూడా సోకుతుందేమోనని భావించిన ఓ వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టు కొమ్మల మద్య మంచాన్ని కట్టీ అక్కడే కానా, పినా , సోనా కానిస్తున్నాడు.. ఇతడు చేసిన ఆలోచన విచిత్రంగా ఉండటంతో అందరి దృష్టి అతనిపైనే పడింది. 


ఈ విచిత్ర ఘటన నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది..గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా సోకింది. దాంతో ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తుందన్న భయమో లేక చిన్న ఇంట్లో విడిగా ఉండే అవకాశం లేదనే భావనో కానీ.. ఏకంగా ఇంటి ముందు చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇతను ఇలానే గత తొమ్మిది రోజుల నుంచి ఉన్నాడు.ఇంట్లోవాళ్లు శివ కోసం నీళ్లు, భోజనం కింది నుంచి పంపిస్తే.. భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో.. ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో ఇలా ఏర్పాటు చేసుకున్న అతను చెప్పుకొచ్చాడు.. ఇది నిజంగా గ్రేట్ ఐడియా కదూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: