రెస్టారెంట్ లో రాకాసి బల్లి.. నెట్టింటా వైరల్...
మన చుట్టూ తరచుగా చిన్న బల్లులు కనిపిస్తాయి. మాములుగా బల్లులను చూస్తేనే వొళ్ళు గగుర్పొడుస్తుంది. అవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. పొరపాటున అవి మీద పడితే ఇక ప్రాణం పోయినంత పనువుతుంది. అదే రాకాసి బల్లి మనకు ఎదురైతే....అలాంటిది సడన్ గా ఓ పెద్ద బల్లి దర్శనమిస్తే.? దాన్ని చూసి ఎవరు భయపడరు. ఇదే విధమైన వింత సంఘటన ఓ రెస్టారెంట్‌లో జరిగింది. ఒక పెద్ద మానిటర్ బల్లి అకస్మాత్తుగా ఓ రెస్టారెంట్‌లోకి దూరింది. బల్లి రాకతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఏం చేయాలో అర్థం కాక హాహా కారాలు చేశారు. ఇంతలో ఓ మహిళా వెయిటర్ మాత్రం ధైర్యంగా బల్లిని రెస్టారెంట్ నుండి బయటకు పంపించారు.
చూశారుగా ..ఆమె ఆ రాకాసి బల్లిని ఎలా బయటకు లాగి పడేసిందో.. రాకాసి బల్లి తోకను పట్టుకుని లాక్కుంటూ వెల్లి బయటపడేసింది. దీంతో అక్కడున్న వారంతా హామ్మాయా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియోను ‘ఫ్రెడ్ షుల్ట్జ్’ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘బిల్లు చెల్లించకపోతే పరిస్థితి ఇది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ యాడ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 26 వేల మంది చూశారు. అదే సమయంలో, కొంతమంది సరదాగా కామెంట్స్ కూడా చేశారు. మరికొందరు ఆ మహిళా వెయిటర్ సాహసాన్ని నెటిజన్లు ఎంతగానో ఎంతగానో మెచ్చుకుంటున్నారు. వండర్ వుమెన్ అని కితాబునిస్తున్నారు.