వైరల్ : 80 ఏళ్ల అవ్వకు ఇల్లు కొనిచ్చిన ఆనంద్ మహీంద్రా....
కష్టపడి జీవించే డైలీ వర్కర్ల సంపాదనంతా కేవలం ఆహారానికే ఖర్చు కాకూడదనే ఉద్దేశంతో ఇడ్లీలను విక్రయిస్తోంది. ఈ వ్యాపారం ప్రారంభించి దశాబ్దాలు దాటినా ఆమె ఇడ్లీ ధరలు పెంచకపోవడం గమనార్హం. నిత్యవసరలు ధరలు భగ్గుమన్నా సరే.. కమలతల్ హోటల్‌లో ఇడ్లీ ధర పెరగదు.ఆమె అంకితభావాన్ని మెచ్చిన ఆనంద్ మహీంద్ర.. తన వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఆమెకు ఇంటితోపాటు హోటల్ నడిపేందుకు తగిన స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. ‘ఆమె చేస్తున్న సేవలో భాగస్వామ్యం కల్పించినందుకు ఇడ్లీ అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో ఆమె ఇంటితోపాటు ఇడ్లీలు తయారు చేసి విక్రయించేందుకు అనువుగా వర్క్‌స్పేస్‌ను కూడా పొందనున్నారు’’ అని వెల్లడించారు. మహీంద్ర ప్రకటన చూడగానే నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తు ఆయన మంచి తనాన్ని శభాష్ అంటూ కొనియాడుతున్నారు.. ప్రస్తుతం మహీంద్రా చేసిన ఈ మంచి పని నెట్టింటా తెగ వైరల్ న్యూస్ లా మారింది...