వామ్మో! రాకాసి గోళ్ళతో పసి బిడ్డ ..

Purushottham Vinay
పసిపిల్లలు ఎంత క్యూట్ గా సాఫ్ట్ గా ఉంటారో తెలిసిందే. వాళ్ళని చూస్తేనే ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆడించాలని అందరూ అనుకుంటారు.అంత సుకుమారంగా సుతి మెత్తంగా ఉంటారు పసి పిల్లలు. ఇక వాళ్ళ బుడ్డి బుడ్డి చేతులు చాలా ముద్దుగా ఉంటాయి. ఇక ఈ పసి బిడ్డ గోళ్లు మాత్రం రాక్షస గోళ్లులాగా వున్నాయి.పసిబిడ్డ గోళ్లు రాక్షస గోళ్లుల ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ చూడండి...సోషల్ మీడియా సైట్ ‘రెడిట్’లో ఓ మహిళ పదునైన రాకాసి గోళ్లతో ఉన్న పసిబిడ్డ చేతి ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ పొడవైన గోళ్లకు అందంగా నైల్ పాలిష్ కూడా వేసింది. ‘‘మీ పిల్లల గోళ్లను కూడా చాలా తక్కువ ధరకే ఇలా చేస్తాను’’ అని ఫొటో క్యాప్షన్‌లో పేర్కొంది. అయితే, ఆ పసిబిడ్డకు ఉన్న గోళ్లు నిజమైనవి కావని, ఫేక్ అని తెలిసింది. అంత పెద్ద గోళ్లు పిల్లలకు పెరగడం అసాధ్యమని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
ఫ్యాషన్ పోకడలకు పోయి మీ పిల్లలకు అలాంటి గోళ్లను చేయించవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. పిల్లలు తమ చేతులతో ముఖాన్ని రక్కుకుంటారని, ఇలాంటి గోళ్లు ఉంటే కళ్లుల్లో గుచ్చుకుంటారని తెలుపుతున్నారు. పిల్లలకు సహజంగా ఉండే గోళ్లు కూడా చాలా పదునుగా ఉంటాయని, ఇలాంటి గోళ్లు పెడితే మరింత ప్రమాదకరమని అంటున్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ న్యూస్ అయింది. ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.చూశారుగా.. ఇలాంటి వైరల్ ఫొటోలను చూసి మీరు కూడా పిల్లల గోళ్లను మాత్రం అలా పిచ్చిగా మార్చకండి. అది చాలా ప్రమాదకరం.అవివేకం కూడాను. చిన్న పిల్లలు సాఫ్ట్ గా ఉంటేనే అందం.ఇక ఇలాంటి వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: