వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సాధారణంగా ఒక సినిమాకి సంబంధించిన సన్నివేశాలు లీక్ అయితే ఆ చిత్ర బృందం ఎంత బాధపడుతుందో తెలిసిందే. కాని ఇక్కడ సీన్ అంత రివర్స్. స్టైలిష్ స్టార్  అర్జున్, క్రియేటివ్  సుకుమార్ ఇద్దరూ కలిసి ఎంతో కసితో  చేస్తున్న సినిమా "పుష్ప". ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లో నుంచీ ఒక ఆరు నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సుకుమార్ అండ్ టీమ్ ఫుల్ ఫైర్ అవుతుందనే అనుకున్నారు. కాని సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సుకుమార్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందట. ఎందుకంటే, సినిమా అవుట్ పుట్ ఇప్పటి వరకూ అద్దిరిపోయిందని, అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ తీసిన సినిమా చాలా పర్ఫెక్ట్ గా  వచ్చిందని అంటున్నారు. షూటింగ్ రష్ ని చూసిన దర్శకుడు సుకుమార్  చాలా సంతోషంగా  ఉన్నాడట. లేటుగా సినిమాని మొదలుపెట్టినా మధ్యలో అవాంతరాలు వచ్చినా షూటింగ్ అనుకున్న విధంగానే సాగుతోందని, ఏదైతే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఉందో అది సూపర్బ్ గా వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసంట్ గా ఈ సినిమా ఫోటోగ్రాఫర్ చనిపోవడం, అలాగే వీడియో సాంగ్ ఒకటి లీక్ అవ్వడం ఇవన్నీ కూడా సినిమా అవుట్ పుట్ పై ఎలాంటి ప్రభావం పడట్లేదని సుకుమార్ వైరల్ కామెంట్స్ చేశాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  రంపచోడవరం లో జరుపుకుంటోంది.బన్నీ  ఇంట్రడక్షన్ సాంగ్ మీద చిత్రీకరణ సాగుతోంది. దీనికి సంబంధించిన వీడియోనే లీక్ అయ్యింది. ఇప్పుడు ఇది చిత్రయూనిట్ తేలికగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన అమ్మాయిగా కనిపించబోతోందని టాక్. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ మార్కెట్ ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: