వెయ్యి మందితో పడక సుఖం అనుభవించిన వ్యక్తి....
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక వ్యక్తి మహా అయితే ఎంత మందితో పడక సుఖం అనుభవిస్తాడు మహా అయితే ఇద్దరు ముగ్గురు ఇంకా మహా అయితే పది మందితో పడక సుఖం అనుభవించవచ్చు. కాని అతడు ఏకంగా 1000 మందితో పడక సుఖం అనుభవించాడు. అతడి పేరు అద్నాన్ ఓక్తర్. వయస్సు 64 ఏళ్లు. కానీ.. ఈ వయస్సులో కూడా అతడు రాత్రయితే ఒంటరిగా పడుకోలేడు. కనీసం పది మంది అమ్మాయిలు తోడుగా పడుకోవల్సిందే. లేకపోతే అతడికి నిద్రపట్టదు. ఆడ స్పర్శ లేకపోతే కనీసం ఆవలింత కూడా రాదు. అందుకే.. వారిని కౌగిలించుకుని మరీ నిద్రపోతాడు. ఇంకా ఏమేమి చేస్తాడనేది.. అతడి ప్రియురాళ్లే కోర్టులో చెప్పారు. అవన్నీ ఇక్కడ చెప్పలేం.
‘మతం’ పేరుతో డబ్బులు బాగానే సంపాదించాడు. అయితే, ఆ సొమ్ములను అతడు అమ్మాయిలకు ఉపయోగించేవాడు. అమ్మాయిలు అందమైన షేపులో కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించేవాడు. ఆ తర్వాత వారిని తన రసిక సామ్రాజ్యానికి ఆహ్వానించేవాడు. కొంతమందిని బెదిరించి లొంగతీసుకుంటే.. మరికొందరిని మాయ మాటలు, డబ్బుతో లొంగతీసుకున్నాడు. ఇలా వెయ్యి మంది వరకు అమ్మాయిలను తన సుఖం కోసం సొంతం చేసుకున్నాడు.ఎట్టకేలకు వాడి పాపం పండింది. 1990 నుంచి మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన మోసాలు, నేరాలు.. బయటపడ్డాయి. దేవుడూ.. దెయ్యమంటూ అమ్మాయిలను భయపెట్టి లొంగదీసుకొనేవాడు. అంతేగాక తన చాతుర్యంతో వేలాది మంది అనుచరులను కూడా సంపాదించాడు.
అమ్మాయిలకు నగ్నంగా వీడియోలు తీస్తూ బెదిరించేవాడు. వారిని తన ఆధీనంలోనే ఉంచుకొనేవాడు.అమ్మాయిలను చిత్రహింసలకు గురిచేసేవాడు. బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించేవాడు. ఫతుల్లా అనే ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు అందించాడు. దీంతో పోలీసులు 2019లో అద్నాన్, వందలాది మంది అనుచరులను అరెస్టు చేశారు. సోదాల్లో వేలాది గర్భస్రావ మాత్రల స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలకు విముక్తి కల్పించారు.కోర్టు ముందుకు హాజరైన అద్నాన్.. న్యాయమూర్తికే షాకిచ్చే వివరాలు చెప్పాడు.
తనకు వెయ్యి మంది ప్రియురాళ్లు ఉన్నారని తెలిపాడు. ప్రేమకు హద్దు లేదని, అందుకే అంతమందికి పంచిపెట్టానని తెలిపాడు. తాను ఎంతమందినైనా తల్లులను చేయగలనని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నీలాంటివాడికి చిన్న శిక్ష సరిపోదంటూ 1075 ఏళ్లు జైలు శిక్ష విధించాడు. అమ్మాయిలను మోసం చేయడం, సెక్స్ నేరాలు, దేశ ద్రోహం, ఆర్థిక నేరాలు తదితర కేసుల్లో అతడికి ఈ శిక్ష పడింది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...