ఆహారం కోసం మనుషులను ప్రాధేయపడుతున్న చిరుత పులి...

Purushottham Vinay
ఇండియాహెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ భూమ్మీద దేవుడు సృష్టించిన మృగాలలో చిరుత పులులు చాలా భయంకరమైనవి. ఇక అవి ఏవైనా జంతువులని కాని మనుషులని కాని చూస్తే ఇంకేమైనా ఉందా క్రూరంగా చంపి తినేస్తాయి. అంతటి ప్రమాదకరమైన జంతువులు చిరుత పులులు. కాని అదే చిరుత పులి ఆకలి కోసం మనిషిని వేడుకుంటే ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి చాలా విచిత్రంగా ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే...

కుల్లులోని తీర్థన్ వ్యాలీలో ఓ చిరుతపులి.. తినేందుకు ఆహారాన్ని పెట్టాలని వేడుకుంటోందంటూ.. సజీవ్ గుప్తా అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను పోస్ట్  చేశారు. ఈ వీడియోలో పర్యాటకులు కేవలం దానితో ఫొటోలు తీసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారని, దాని ఆకలిని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ ‌‌ను ఆయన ఐఎఫ్ఎస్ అధికారులు సుధాన్ రామెన్, ప్రవీణ్ కాశ్వన్, సుశాంత నందాలను ట్యాగ్ చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: