సోషల్ మీడియాలో వైరలవుతున్న ఎన్టీఆర్ మనవడి పెళ్లిఫోటోలు!
అయితే తాజాగా నందమూరి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. అసలు విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారికి ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారిలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన రేఖావాణి అనే యువతినే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. నందమూరి బాలకృష్ణ, వసుందర దంపతులు, అలాగే వారి తనయుడు మోక్షజ్ఞలు ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సతీ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక చైతన్య కృష్ణ కూడా ‘ధమ్’ అనే ఒక సినిమాలో యువ హీరోగా నటించాడు. కానీ తర్వాత కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.