ఒక్క రూపాయి కే క్వార్టర్ మందు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తా..!!

KISHORE
కొందరు తాము అభిమానించే వారి కోసం ఏమైనా చేస్తారు.అటువంటి వారి అభిమానం చూస్తే  ఒక్కోసారి ఆశ్చర్యం కలుగక మానదు. తమ అభిమాన నటుడు, నాయకుడి పుట్టిన రోజైనా, పెళ్లిరోజైనా సెలబ్రేషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉండాలనుకుంటారు ఫ్యాన్స్. సరిగ్గా ఇదే రీతిలో గద్వాల జిల్లాకు చెందిన ఓ అభిమాని ఇదే చేశాడు. తన అభిమాన డైరెక్టర్ పెళ్లిరోజున ఒక్కరూపాయికే మద్యం పంపిణీ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు.వివరాల్లోకి వెళితే.. 

చింతకుంట విష్ణు అనే వ్యక్తి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు టాలీవుడ్ దర్శకుడు ఎన్. శంకర్ అంటే ఎంతో అభిమానం. నవంబర్ 16న శంకర్ పెళ్లి రోజు కావడంతో ఆయన వెడ్డింగ్ యానివర్సరీని విష్ణు ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడి పెళ్లి రోజును పురస్కరించుకొని అలంపూర్‌లో ఒక్క రూపాయికే మద్యం పంపిణీ చేసి సంచలనం సృస్టించాడు.. 

ఆదివారం ఉదయం గంట పాటు మందుబాబులకు క్వార్టర్ బాటిల్స్ పంపిణీ చేశారు..ఈ వార్తా విన్న మందు బాబులు ఎగబడి మద్యం సీసాలు తీసుకెళుతున్నారు.ఈ వార్తా విన్న మరికొందరు ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టాలని సోషల్ మీడియా లో చమత్కరిస్తున్నారు.ఏదిఏమైనప్పటికి ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో విపతీతంగా వైరల్  అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: