వైరల్ : "సౌత్ ఇండియన్స్ నడుము పిచ్చోళ్ళు..!". నోరు పారేసుకున్న పూజా హెగ్దే...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. టాలీవుడ్ లో  ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే చలామణి అవుతుంది. పెద్ద పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డే నే..! అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా ఈమెనే..! తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈమె పారితోషికం నచ్చితేనే సినిమాలకు అంగీకరిస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు అందరి నటీనటుల పారితోషికాలను తగ్గించుకోమని విన్నపించుకుంటున్నారు. కానీ పూజా హెగ్డే  మాత్రం తగ్గింది  లేదట.అయినా కాని నిర్మాతలు ఆమెకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఇంతలా సౌత్ సినిమా ఆమెకు అన్ని సౌకర్యాలు ఇస్తుంటే.. ఆమె మాత్రం బాలీవుడ్ పై మోజుతో అనుకుంట సౌత్ సినిమాను చిన్న చూపు చూస్తుంది. ఈ విషయాలు నేను చెప్తున్నవి కాదు.. సోషల్ మీడియాలో నెటిజన్లు పలుకుతున్నవి. అంతలా పూజ వారిని ఏమంది అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ.. ‘సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు అంతా నావెల్(నడుము) పిచ్చోళ్ళు. ఆ మత్తులోనే ఉంటారు’ అంటూ కామెంట్ చేసింది.

నిజానికి ఆమె నవ్వుతూనే కామెంట్ చేసింది. కానీ అది చాలా సీరియస్ అయ్యింది. ‘ఓ క్రేజ్ వచ్చిన తరువాత సౌత్ సినిమా అంత తక్కువగా కనిపిస్తుందా’ అంటూ నెటిజన్లు ఆమె పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: