పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని ఆ విధంగా ప్రతీకారం తీర్చుకున్న యువకుడు...
కేరళకు చెందిన కన్నూరు జిల్లా వాసి అల్బిన్ మాథ్యూ (30) పెళ్లికి సిద్ధమవుతుండేవాడు. కాని అతనికి పెళ్లి కాకుండా ఓ వ్యక్తి పనిగట్టుకుని మరి అతడి ఇంటికి వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొడుతుండేవాడట. ఇంట్లోవాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా.. ఒక్కటి కూడా ముందుకెళ్లేది కాదు. దీనికి కారణం.. అల్బిన్ ఇంటి ముందు ఆ వ్యక్తే అని తెలుసుకున్నాడు. అక్కడ ఆ వ్యక్తి దుకాణం వుండేదట. స్థానికులు నిత్యం అక్కడ జూదం ఆడతారు. మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. దీంతో అల్బీన్ కుటుంబికులు ఎప్పటి నుంచో ఆ దుకాణంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ దుకాణ యజమానికి, అల్బీన్కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆ దుకాణ యజమాని అల్బిన్కు వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అల్బిన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
జేసీబీతో ఆ దుకాణాన్ని కూల్చిపడేసి అతడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనం కోశియం’ సినిమా పాటను పెట్టి.. ఆ సినిమాలోని రియల్ లైఫ్ సీన్ అంటూ వీడియోను ‘యూట్యూబ్’లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. దీనిపై షాపు యజమాని స్పందిస్తూ.. అతడి ఆరోపణల్లో నిజం లేదని, వ్యక్తిగత కక్షతోనే అల్బిన్ తన దుకాణాన్ని కూల్చేశాడని తెలిపాడు. ఇలాంటి మరిన్ని వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..