వైరల్ ఎహే: ఖతర్నాక్ ఐడియా.. పేదవాడి ఫేస్‌మాస్క్ చూస్తే మతిపోవలసిందే.. !
కరోనా వైరస్ వల్ల మనిషికి కష్టాలు రావడమే కాదు.. అతని మస్తిష్కంలో కొత్త కొత్త ఐడియాలు కూడా వచ్చేలా చేస్తుంది.. ఈ కరోనా ఒక వైపు భయం పుట్టిస్తూనే, మరో వైపు మనిషిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది.. ఇక కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి వారు ఈ వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటించమని సలహాలు, సూచనలను ఇస్తున్నారే గానీ, దీని బారి నుండి ఎలా బయటపడాలో సరిగ్గా వివరించడం లేదు..
అందుకే కొందరు ఔత్సాహికులు కరోనా విషయంలో వారికి వచ్చిన భిన్నమైన ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.. ఈ క్రమంలో ఎన్నో కొత్త కొత్త పద్దతులను కనిపెడుతూ, వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఒక మంచి పని చేసిన వారు అవుతున్నారు.. అలాగే కరోనా బారి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియని వారు కూడా ఇలాంటి వీడియోలు చూసి తెలుసుకుంటున్నారు..
అయితే ఇలా వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చాలమందిని ఆకర్షిస్తున్నాయి.. ఈ నేపధ్యంలో ఒక యువకుడు ప్రతి వారికి ఉపయోగపడే ఫేస్ మాస్క్‌ను తయారు చేసి చూపించాడు.. అది క్షణాల్లోనే.. దీని తయారికి పెద్దగా ఏం అవసరం లేదు.. మనం నిత్యం ఉపయోగిస్తున్న 2 లేదా 3 నుండి 5 లీటర్ల వాటర్ గానీ, కూల్‌డ్రింక్స్ బాటిల్ గానీ అవసరం.. ఇలాంటి ఒక ఖాళీ బాటిల్‌ను తీసుకుని దాని పై భాగాన్ని, క్రింది భాగాన్ని కట్ చేస్తే సరిపోతుంది.. ఫుల్‌గా ఉండే ఫేస్ మాస్క్ తయారు అవుతుంది..
మీకు ఇంకా అర్ధం కాలేదంటే ఈ క్రింది వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూడండి పూర్తి క్లారీటి వస్తుంది.. చూశారా ఎంత ఈజీగా ఈ మాస్క్ తయారు చేశాడో ఆ యువకుడు.. ప్లాస్టిక్ వల్ల నష్టం ఉందని విన్నాం కానీ, మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలు చాలానే వస్తాయి అంటున్నారట ఈ వీడియో చూసిన వారు.. ఇక మీరు కూడా సిగ్గుపడకుండా ట్రై చేయండి.