ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..?

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పలు రకాల పథకాలను కూడా అమలు చేయడంతో పాటు రేషన్ కార్డుదారులకు కూడా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. ఇప్పటికే నేరుగా ఇంటి దగ్గరికి రేషన్ సరుకులను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే రేషన్ సరుకుల జాబితాలో మరికొన్ని ఆహార ధాన్యాలను కూడా చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలియజేయడం జరుగుతోంది.

తాజాగా కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ధాన్యం సేకరణ అంశాల పైన అధికారులతో చర్చించినట్లుగా తెలియజేశారు. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రేషన్ కార్డు వినియోగదారులకు గోధుమపిండి, జొన్నలు, రాగులు ఇచ్చే విధంగా సన్న హాలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న.. ఈయన సివిల్ సప్లై మంత్రితో శాఖలు పలుమార్పులు కూడా తీసుకువచ్చామని తెలియజేశారు రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు రైతులకు సరైన పంట ధర కల్పించేలా చేశామని తెలియజేయడం జరుగుతోంది. అంతేకాకుండా నేరుగా రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆపైన ఎంత వచ్చినా కూడా సేకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంటింటా రేషన్ పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా జగన్ మళ్లీ సీఎం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తాన్ని చేశారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కూడా స్పందించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకునేందుకే ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలిపారు. ఇక లోకేష్ ఒక జోకర్ల రోడ్డు మీద తిరుగుతున్నారని వచ్చే ఎన్నికలలో లోకేష్ చంద్రబాబు ప్రభావం అసలు ఉండదని కూడా తెలియజేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: