మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

Divya
మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి వాటిలోనైనా సరే తమకు తామే సాటిగా దూసుకుపోతున్నారు. మహిళ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అటువంటి మహిళలు గొప్పతనానికి చెప్పుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనే వేదిక ఉందని చెప్పవచ్చు. కార్మిక ఉద్యమం నుండి పుట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మహిళలకు పట్టం కంటే ఒక సరికొత్త పద్ధతిలోనే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది.
దాదాపుగా శతాబ్ద కాలానికి ముందు నుండే.. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ కోపం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నారు  మహిళా సమస్యల పైన మహిళ సాధికారికైన దృష్టి పెంచేలా మహిళలు అనేక రంగాలలో ఆర్థికంగా నిలదొక్కుకోనేల ఉండేందుకు అన్ని రకాలుగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి.ప్రభుత్వాలు. ఇక ఈ ఏడాది లింగ సమానత్వమే కాకుండా ప్రతిచోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. అందుకోసం తగిన నిర్ణయాలు కూడా ఐక్యరాజ్యసమితి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈసారి మహిళలకు సమాన అవకాశాలు ఎందుకు లేవు మహిళలతో కూడిన వాటిని ప్రపంచాన్ని సృష్టించాలి అనే ఉద్దేశంతోనే ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటే మహిళల ఉన్న శక్తి బయటకు తీసుకు రావడమే కాకుండా మహిళ చైతన్యాన్ని మహిళలు సాధించిన విజయాలను అందరికీ తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించడం కోసమే ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పవచ్చు. ఆర్థికంగా మహిళలు సాధించిన ఎన్నో విజయాలు వారి గొప్పతనాన్ని మహిళా దినోత్సవం వేదికగా చెప్పడం వల్ల అందరిలో కూడా కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తుందని.. రాబోయే భవిష్యత్తులో కూడా వారు సాధించాల్సిన అనేక విషయాల పైన కూడా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: