వైరల్ : పిచ్చి ముదిరింది.. చివరికి దిమ్మతిరిగింది?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కొంతమంది చేస్తున్న పిచ్చి పనులు కాస్త చివరికి ప్రాణాల మీదికి తెస్తూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా అందరి దృష్టిని ఆకర్షించి ఎక్కువ మొత్తంలో లైక్ లు షేర్లు సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పిచ్చి పనులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత పిచ్చి పీక్స్ కి వెళితే ఇలాగే ఉంటుందని నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది. సాధారణంగా టపాసులు కాల్చడం పర్యావరణానికి ఎంతో ప్రమాదం అన్న విషయం తెలిసిందే. అయితే టపాసులు కాల్చడం ద్వారా ఇక వచ్చే వాసన పీల్చడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ విషయం అందరికీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు తెలుసు. అయినప్పటికీ ఎవరిలో మాత్రం రాదు అని చెప్పాలి. దీపావళి పర్వదినంలో పరిమితికి మించి బాణాసంచా కాల్చుతూ ఉంటారు ఎంతోమంది. కొంతమంది సాధారణ సమయాల్లో కూడా సోషల్ మీడియాలో లైక్ల కోసం ఇలాంటివి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇలా టపాసులు కాల్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఒక యువకుడు ఇలాంటిదే చేశాడు. చివరికి అతని దిమ్మతిరిగిపోయింది అని చెప్పాలి. ఒకచోట టపాసులు వెలిగించి ఇక దానిమీద ఒక డబ్బా బోర్లించాడు. అయితే క్రాకర్ కు నిప్పు ఉండడం వల్ల అది ఒక్కసారిగా పేలింది. దీంతో పైన బోర్లించిన డబ్బా కాస్త అమాంతం గాల్లోకి ఎగిరింది. అయితే ఇలా గాల్లోకి ఎగిరిన డబ్బా చివరికి టపాసు కాల్చిన వ్యక్తి తలపై పడింది అని చెప్పాలి. ఈ ఘటనలో అతని తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: