పెళ్లి వేదికపై.. అల్లుడి నోట్లో సిగరెట్ వెలిగించిన అత్తమామలు?

praveen
సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా సరే చెడు అలవాట్లకు దూరంగా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి మరి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేసి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వారి కోసం నేటి రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు చాలానే వెతుకుతూ ఉన్నారు. అయితే ఎంతోమంది పెళ్ళికొడుకులు కూడా తమకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నప్పటికీ పెళ్లి సమయంలో తనకు ఏమీ అలవాట్లు లేవు అన్నట్లుగానే ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ పెళ్లి వేదికపైనే వరుడు సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం లాంటివి చేస్తే ఇక వధువు తల్లిదండ్రులు పెళ్లిని క్యాన్సల్ చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది.


 కానీ ఇక్కడ జరిగిన విషయం మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. సిగరెట్ తాగడం లాంటి చెడు అలవాట్లు లేకుండా చూసుకోవడం కాదు ఏకంగా వధువు తల్లిదండ్రులే.. అంటే వరుడు అత్తమామలే స్వయంగా ఒక సిగరెట్ అల్లుడు నోట్లో పెట్టి ఇక అగ్గిపుల్లతో వెలిగించడంకి సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ప్రస్తుతం నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక సిగరెట్ను నోట్లో పెట్టి వెలిగించడమే కాదు బీడీ పాన్ తో కూడా అత్తగారు పెళ్లి కొడుకును స్వాగతించారు అని చెప్పాలి.

 అయితే దక్షిణ గుజరాత్ లోని కొన్ని గ్రామాలలో ఇక ఇలాంటి సాంప్రదాయాన్ని ఎన్నో ఏళ్ల నుంచి అనుసరిస్తూ వస్తున్నారట. అయితే ఇక ఇలా అత్తమామలు వరుడి నోట్లో సిగరెట్ పెట్టి వెలిగించిన సమయంలో అతను పొగ తాగలేదని.. కేవలం ఆచారం కోసం అందరూ ఇలా చేశారని.. ఇక ఇలా చేసిన వెంటనే వరుడు తన నోట్లో ఉన్న సిగరెట్ ని మళ్ళీ అత్తమామలకు ఇచ్చేశాడు అన్న విషయం వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అయితే బీహార్ లో ఒడిశా లోను కొన్ని ప్రాంతాలలో ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుందట. ఏదేమైనా ఈ వీడియో మాత్రం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: