ఓరినాయనో.. అది బస్సా.. పడవా.. నీళ్లలో దూసుకుపోతుంది?

praveen
సాధారణంగా భారీగా వర్షాలు పడి ఇక రహదారులు మొత్తం వరద నీటితో నిండిపోయిన సమయంలో ఇక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మనకేమవుతుందిలే అని కొంతమంది మాత్రం ఇక వరద ప్రవాహం లోనే వాహనాలను నడిపి ఎన్నో ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇలా  రహదారులు మొత్తం నీటితో నిండిపోయి కార్లు బైక్లు అన్నీ కూడా నీటి మునిగిపోతూ ఉంటే... కొన్ని కొన్ని సార్లు ఇక ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ప్రస్తుతం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో చెట్లు, ఇల్లు ఇక వాహనాలు మొత్తం వరద నీటిలో మునిగిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఈ భారీ వరదలను అతిపెద్ద విపత్తుగా కూడా అధికారులు చెప్పుకొచ్చారు అని చెప్పాలి. అయితే ఈ వరదల కారణంగా కార్లు బైకులు ఎక్కడికక్కడ నీట మునిగి ఇక పార్కు చేసిన చోటే ఉంటే.. ఒక బస్సు మాత్రం వరద నీటిలోనే ఏకంగా పడవ లాగా దూసుకుపోతోంది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆక్లాండ్ కౌన్సిల్ లోని 21 స్థానిక బోర్డులో ఒకటైన మౌంగాకికి టమాకి స్థానిక బోర్డులో రహదారిపై లోతు వరద నీటితో నిండుగా ఉంది. అక్కడ ఉన్న ఒక కారు కేవలం దానిపై ఉండే రూఫ్ మాత్రమే కనిపిస్తుంది అంటే.. వరద ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఒక పెద్ద బస్సు సునాయాసంగా వరద నీటిలో ముందుకు దూసుకుపోతుంది. ఇక అందులో ఉన్న ప్యాసింజర్లు నిలబడి కనిపిస్తున్నారు. ఇక బస్సు డ్రైవర్ కూడా కాళీ రోడ్డుపై బస్సు నడిపినంత ఈజీగా.. ఇక వరద నీటిలో బస్సును పోనిచ్చాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అసలు అది బస్సేనా అని కొంతమంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: