Viral Video: వామ్మో మొసలితో ఆటలు.. గూస్బంప్స్?

Purushottham Vinay
Viral Video: సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యింది. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎల్లప్పుడూ కూడా చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు సరదాగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యకరంగా ఇంకా అలాగే భయంకరంగా కూడా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ భయంకరమైన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.మొసలి చాలా భయంకరమైన జంతువు. దాని దారిదాపుల్లోకి ఏ జంతువు కానీ మనిషి కానీ వెళ్లిన దానికి ఆహారం కావాల్సిందే.సాధారణంగా మొసలికి ఆహారాన్ని చాలా దూరం నుంచి అందిస్తారు. కానీ.. ఓ వ్యక్తి అయితే ఏకంగా నీటిలో ఉన్న మొసలికి ఆహారాన్ని అందించాడు. అతను ఆహారాన్ని అందించిన తీరు అయితే అందర్ని ఎంతగానో భయాందోళనకు గురిచేస్తోంది. కుక్కపిల్లలు, పిల్లులు ఇంకా అలాగే పక్షులు వంటి చిన్న పెంపుడు జంతువులకు సంబంధించిన చాలా వీడియోలను మీరు చూసే ఉంటారు. 


ఇవన్నీ కూడా సాదుజంతువుల కిందకు వస్తాయి.. మనుషులతో కూడా అవి ఎలాంటి హాని చేయకుండా కలిసి మెలసి ఉంటాయి. అయితే, మొసళ్ల వంటి ప్రమాదకరమైన జంతువులకు చాలా దూరంగా ఉండటమే మంచిది. కానీ, ఫ్లోరిడాకు చెందిన ఈ వ్యక్తి మొసలికి మాంసం ముక్కను తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం.. నెట్టింట వైరల్‌గా మారి నెటిజన్లను బాగా పిచ్చెక్కించింది.ఈ వైరల్ వీడియోలో మనం గమనిస్తే.. ఒక వ్యక్తి తన మోకాళ్ల మధ్య మొసలిని పట్టుకుని మాంసం ముక్కను తినిపిస్తున్న తీరు మీరు చూడవచ్చు. ఆ మనిషిని చూసిన మొసలి అతని దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత మొసలిని అతను తన రెండు కాళ్ల మధ్యలోకి తీసుకుని.. మాంసం ముక్కను తినిపిస్తాడు. ఆహారం ఇచ్చిన తర్వాత అతను మొసలిని నీటిలోకి ఈదడానికి వెంటనే వదిలేస్తాడు.ఇలా భయంకర పనులు చేస్తే ఖచ్చితంగా చావు తప్పదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: