టాపిక్ లో ఇరుక్కున్నాడు.. అక్కడే కారుపై పెగ్గు వేశాడు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా కూడా ట్రాఫిక్ సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి. నేటి రోజుల్లో వాహనాలు వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇక ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో అయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఒక్కసారి కారులో కూర్చొని ట్రాఫిక్ లో ఇరుక్కున్నామంటే చాలుముందుకు ఈ వెనక్కి వెళ్లలేక ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.Your browser does not support HTML5 video.
 ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కున్న ప్రతిసారి కూడా వాహనదారులు ఎంతోమంది చిరాకు పడుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లై ఓవర్లను ఏర్పాటు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తి సమయాన్ని వృధా చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఏకంగా ట్రాఫిక్ లోనే దుకాణం పెట్టేసాడు.

 ఈ ఘటన హర్యానాలోని గురు గ్రామ్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ట్రాఫిక్ లో అతని కారు ఇరుక్కుపోయింది. దీంతో సమయం వృధా అవుతుంది. ప్రతిక్షణం కూడా ఎంతో ముఖ్యమైనది అనుకున్నాడో ఏమో.. ఏకంగా కారు రూఫ్ పైకి ఎక్కాడు. ఆ తర్వాత మందు బాటిల్ను కారూలో నుంచి తీసుకుని ఎంచక్కా ఒక పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అయితే సదరు వ్యక్తి అలా చేయడం చూసి చుట్టుపక్కల ఉన్న వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక దీన్ని సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: