వీడి ధైర్యం తగలెయ్య.. సింహానికి లిప్ లాక్ ఇచ్చాడు?

praveen
అడవిలో ఉండి అతి బలమైన జంతువు ఏది అంటే అందరూ టక్కున చెప్పేస్తారు అదేదో కాదు అడవికి రారాజు అయినా సింహమని. ఇక సింహం ఒక్కసారి ఏదైనా జంతువుని వేటాడాలి అని డిసైడ్ అయ్యిందంటే చాలు అప్పుడు వార్ వన్ సైడ్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఆ జంతువు సింహానికి ఆహారంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక సింహం వేట ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయని చెప్పాలి.

 ఇకపోతే ఇక అడవుల్లో ఉండే సింహాలకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రత్యక్షమవుతూ వైరల్ గా మారిపోతూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ వీడియోలను చూసేందుకు నెట్టిజెన్స్ అందరు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణంగా ఏకంగా మృగరాజు దగ్గరికి వెళ్లడానికే ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి పంజా విసిరిందంటే ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే.. కానీ ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా సింహాలతోనే ఆటలు ఆడుతూ.. స్నేహం చేస్తూ ఉండటం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సింహాన్ని దగ్గర నుంచి చూడడానికి భయపడితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా సింహానికి లిప్ లాక్ ఇచ్చేసాడు. లయన్ లవర్స్ హబ్ అనే అకౌంట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ కు మీ ఆప్యాయత అవసరమైనప్పుడు అని ఒక క్యాప్షన్ జోడించి సింహంతో ఒక యువకుడు సరదాగా గడిపిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది చూసిన నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక భారీ సింహం తల వెంట్రుకలను హాయిగా నిమురుతు.. చిన్నపిల్లడిని లాలించినట్లుగా ఆ సింహాన్ని లాలిస్తూ ముద్దు చేశాడు సదరు వ్యక్తి.  ఇది చూసి నీ ధైర్యం ఏంటి సామీ.. సింహంతోనే ఆటలా అంటూ ఎంతో మందిని కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: