నిజమైన పక్షిరాజు.. అతన్ని చూడగానే పక్షులు ఏం చేస్తున్నాయో తెలుసా?

praveen
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన  రోబో 2.0 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇక సెల్ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పక్షులన్నీ చనిపోతూ ఉంటే పక్షులను పెంచే ఆయన ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. దీంతో ఒకానొక సమయంలో సెల్ఫోన్ టవర్ కి ఉరి వేసుకొని చనిపోతాడు. దీంతో పక్షుల ఆరాతో ఇక ఒక పెద్ద రాక్షసుడిలా మారి పక్షిరాజు అనే పేరుతో అరాచకాలు చేస్తూ ఉంటాడు. ఇలా పక్షిరాజు పాత్ర రోబో 2.0 సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ సినిమా చూసినప్పుడు ఇవన్నీ సినిమాల్లో కనిపించే దృశ్యాలు మాత్రమే నిజజీవితంలో ఇలాంటి పక్షిరాజులు ఉండరు అని అందరూ అనుకుంటూ ఉంటారు.

 అలా అనుకున్నారంటే పొరపాటు పడ్డట్టే ఎందుకంటే ఏకంగా పక్షిరాజు కాదు అంతకుమించి పక్షుల బాగోగులు చూసుకునే ఒక వ్యక్తి గురించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. కేవలం పక్షులే కాదండోయ్ ఉడతా వంటి చిన్న చిన్న జంతువులు సైతం అతని వద్దకు ప్రేమగా వస్తూ ఉన్నాయి. ఇక అతను కనిపించాడంటే ఎంతగానో సంబరపడిపోతున్నాయి. అతను వేసి  ఆహారాన్ని కడుపునిండా ఆరగిస్తూ ఇక అతని మీద ఆడుకుంటూ ఉన్నాయని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్స్ అందరూ కూడా నిజమైన పక్షిరాజు ఇతనే అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 సోనియా అనే నేటిజన్ ఇక ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేయగా అందరు దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని ఆ బ్యాగ్ జిప్పు తీశాడు. ఇంకేముంది అతను కనిపించగానే పక్షులన్నీ కూడా ఎంతగానో సంబరపడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే వందల పక్షులు  అతని చుట్టూ చేరాయి. ఇక ఉడతలు కూడా వచ్చేసాయి. ఈ క్రమంలోనే అతని బ్యాగులో ఉన్న గింజలు  తీసి ఆ పక్షులు,ఉడతలకు మేతగా వేస్తాడు సదర్ వ్యక్తి. ఈ క్రమంలోనే వందల పక్షులు ఉడతలు కూడా అతను వేసిన గింజలను తింటూ ఇక అతని మీద ఆడుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఈ జంతు ప్రేమికుడుని చూసి నేటిజెన్లు సైతం ఆశ్చర్యపోతున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: