నదిలో దూకబోయిన మహిళ.. ఇంతలో బస్సు డ్రైవర్ అద్భుతం?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ఇక ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోని అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తద్వారా ఇక ప్రతిరోజు ఎన్నో లక్షల వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు కొన్ని ప్రతి ఒక్కరుని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి తెలియదు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది.

 ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు మనుషులు. కేవలం వారి ప్రాణాలను బలవంతంగా తీసుకోవడమే కాదు వారి కడుపున పుట్టిన పిల్లల ప్రాణాలను కూడా తమతో పాటే ప్రాణం తీసేందుకు సిద్ధమవుతున్నారూ అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇప్పుడూ ఇలాంటిదే వెలుగు చూస్తుంది. ఏకంగా ఒక మహిళ  వంతెన పైనుంచి నదిలో దూకపోయింది.. కేవలం మహిళ మాత్రమే కాదు తన బిడ్డతో కలిసి ఇలా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.

 కానీ బస్సు డ్రైవర్ ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో చివరికి ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగాడు అని చెప్పాలి. దీంతో చివరి క్షణంలో మహిళను కాపాడిన బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి చూసి ప్రస్తుతం నెటిజన్లు అందరూ కూడా ఫిదా అవుతున్నారు. ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఓ మహిళ తన బిడ్డను చేయి పట్టుకుని వంతెన పై నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అంతలోనే మహిళ తన బిడ్డను చేతిలో పట్టుకుని వంతెన పై నుంచి దూకెందుకు ప్రయత్నించింది. అక్కడికి బస్సు నడుపుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి ఇక బస్సు డ్రైవర్ సీట్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకి మహిళను పట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి మరికొంతమంది వచ్చి సహాయం చేయడంతో ఇద్దరు ప్రాణాలను కాపాడగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: