చిలక ముక్కుతో వింత చేప.. వైరల్?

Purushottham Vinay
దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రకృతికి మించింది ఏది లేదు.మన చుట్టూ వుండే ప్రకృతి ఎన్నో వింతలు విశేషాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో నేటికీ మనిషికి తెలియని ఎన్నో రకాల వింతలు విశేషాలు చాలానే దాగున్నాయి. అసలు ఈ ప్రకృతిలో ప్రతి జీవి కూడా దేవుడు క్రియేట్ చేసిన ఓ అద్భుతమే. భారీ జీవులు, అందంగా అలరించే జీవులు ఇంకా అలాగే రంగులు మార్చే జీవులు ఇలా ఎన్నో రకరకాలు దర్శనమిస్తాయి.ముఖ్యంగా సముద్రం ఈ సృష్టిలో చాలా పెద్దది. సముద్రం ఎన్నో రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు నిలయం. సముద్ర గర్భంలో రత్నాలు మాత్రమే కాకుండా అనేక రకాల జీవ రాశులు కూడా జీవిస్తూ ఉంటాయి. గత కొంత కాలంగా ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జీవి కనిపించినా కూడా వెంటనే దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ దర్శనమిస్తుంది. గత కొంతకాలంగా నదుల్లో విచిత్రమైన జీవులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా కనీవినీ ఎరుగని చిలుక ముక్కు చేప ఒకటి జాలర్ల వలకు చిక్కడం జరిగింది.


ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వింత ఘటన అనేది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.అక్కడ స్థానిక మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. ఈ వింత చేప తల అచ్చం పక్షి తలను పోలి ఉంది. ఈ చేప విషయానికి వస్తే.. జిల్లాలోని కురవి మండలం బలపాల గ్రామ శివారులోని చెరువులో ఈ వింత చేప దొరికింది. ఈ చేప ముఖం చూస్తే అచ్చం చిలుక ముక్కు లాగా ముక్కు కలిగి ఉండి చూపరులను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వలలో పడిన ఈ వింత చేపను చూసేందుకు అక్కడ ఊరు వారు తెగ ఎగబడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ కూడా ఇలాంటి ఓ చేప ఉంటుందని తాము ఊహించలేదని..ఇంకా ఇలాంటి చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు చెప్పారు.అక్కడి జాలర్లు అయిన పిట్టల వెంకన్న, ఉపేందర్‌, చెన్నబోయిన వీరన్న నదిలో వేటకు వెళ్ళినప్పుడు ఈ చేప చిక్కిందని తెలిపారు.ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: