ఇదేం విడ్డూరంరా నాయనా..కన్ను ఊడి చేతిలో పడింది..

Satvika
కన్ను ఊడి చేతిలో పడింది..ఏంటీ..కన్ను ఊడి పోవడం ఏమిటి? అని అనుకుంటున్నారా..మీరు విన్నది అక్షరాల నిజం..అవును..కొన్ని నమ్మలేని నిజాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి..మనం నమ్మలేని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు చెబుతున్న సమయంలో నిజంగా అలా జరిగిందా, లేదంటే వీరు ఊహించి చెప్తున్నారా..అబద్ధం చెపుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా జార్ఖండ్‌ లో జరిగిన ఒక సంఘటన అలాగే అనిపిస్తోంది. ఎంత నమ్మకం కలిగేలా చెప్పినా కూడా అనుమానంగానే ఉంది అంటూ కొందరు వ్యాఖ్యలు చేసే విధంగా సంఘటన ఉంది.

ఒక వ్యక్తి కంటి వద్ద దురదగా ఉండడంతో గట్టిగా రఫ్ చేయగా ఏకంగా కన్ను ఊడి చేతిలో పడింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్ సమీపంలో ఒక గిరిజన గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన గంగాధర్ సింగ్ అనే వృద్ధుడు గత కొన్ని సంవత్సరాలుగా కంటి చూపు మందగించి సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతడి కంటి చూపు సమస్యకు ఒక ఎన్జీవో సహాయం చేసి 2021 నవంబర్ నెలలో ఆపరేషన్ చేయించారు. సర్జరీ చేసిన రెండు రోజుల తర్వాత ఇంటికి వెళ్లి పోయిన గంగాధర్ సింగ్..

ఆ తర్వాత కంటి వద్ద దురదగా అనిపించడంతో గట్టిగా రుద్దాడు, దాంతో కన్ను ఊడి చేతిలో పడింది. కన్నుఊడి చేతిలో పడటమేంటి అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే ఆపరేషన్ చేసిన సమయం లో గాజు కన్ను పెట్టిన వైద్యులు ఆ ఆఫరెషన్ ను సరిగ్గా చెయ్యలేదు..ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు... మనుషుల ప్రానాల తో ఆడుతున్నారంటూ మండిపడుతున్నారు... ఈ ఘటన గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: