వైజాగ్ ఆర్కె బీచ్ లో బయటపడ్డ పురాతన నిర్మాణం?

Purushottham Vinay
ఇక వైజాగ్ అనగానే ముందుగా అందరికి కూడా గుర్తుకువచ్చేది పాల నురగలా పైకి ఎగిరే అందమైన బంగాలఖాతం సముద్రమే. ఇక ఈ ఈ సముద్రం ఎన్నో రహస్యాలని తన అంతరగర్భములో దాచుకుంది. కాల క్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతుంది. తాజాగా విశాఖ నగరంలో ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్ కె బీచ్‌ లో ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్‌లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి. అయితే, కాలప్రవాహంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి. శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్‌లను నిర్మించుకుని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతుంటారు.కేవలం రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అండర్‌గ్రౌండ్‌ లో రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అంటారని అందరికీ తెలుసు. అయితే నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా ఈ బంకర్లను నిర్మించుకుంటారు. అత్యవసర పరిస్థితిలో వాడుకోడానికి మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్, నీళ్లు, ఆహారం, వంటి వాటిని బంకర్లలో ఎప్పటికప్పుడు రెడీగా ఉంచేవారు.


ఇక బంకర్‌ ఏదైనా సరే.. ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి ఇంకా మెట్లు ఉంటాయి. ఎలాంటి కిటికీలుగానీ, ఇతర మార్గాలు గానీ దాదాపుగా ఉండవు. లోపల దాక్కున్నవారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా కాస్త వెంటిలేషన్‌ ఏర్పాటు చేస్తారు. యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో ఈ బంకర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం బాగానే ఉండేది.ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.ఓ సారి విశాఖ హార్బర్‌పై జపాన్ బాంబు దాడి చేసిందని చరిత్ర చెబుతుండటంతో ఈ బంకర్ అప్పటిదే అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో.. అలాగే చూసేందుకు కూడా కాస్త వెరైటీగా ఓ గుహలాగా ఉండటంతో దానిని చూసేందుకు పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. ఓ వైపు సముద్రం అందాలు.. మరోవైపు ఈ బంకర్ పక్కన ఫోటోలు తీసుకుంటున్నారు. వరల్డ్‌ వార్‌ మెమరీస్‌ అంటూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. బంకర్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: