బామ్మ డ్యాన్స్ చూస్తే మతి పోతుంది భయ్యా..!

Satvika
సోషల్ మీడియాకు క్రేజ్ ఎంతగా పెరిగిందో అందరికి తెలుసు..ఎక్కడ ఏమి జరిగిన కూడా వెంటనే తెలిసి పోయింది.అయితే చాలా మంది స్మార్ట్ ఫోన్లను వాడుతుంటారు.. అందులో ఎక్కువ మంది సోషల్ మీడియా లో వివిధ ప్లాట్‌ఫాం లను ఉపయోగిస్తున్నారు.అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి..అందులో బామ్మల డ్యాన్స్ లు ఎక్కువగా  చక్కర్లు కోడుతున్నాయి.అయితే తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.



సోషల్ మీడియాలో ట్యాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పదిమందిలో ఒకరిలా కాకుండా.. పది మంది వేరు, తాము వేరు అనేలా ఎవరు ఏం చేసినా జనాలు వాళ్లను ఆదరిస్తూ ఉంటారు. తాజాగా ఓ ముసలావిడ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.



దళపతి విజయ్ కి వీరాభిమాని అయిన ఓ బామ్మ సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఇప్పుడు ఈ బామ్మ సోషల్ మీడియా సెలబ్రెటీగా మారింది. విజయ్ తాజాగా చేసిన 'బీస్ట్' సినిమాలోని 'అరబిక్ కుతు' పాటకు ముసలావిడ అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. విజయ్ అరబిక్ కుతు పాటకు ఏ స్టెప్పులు అయితే వేశాడో అవే స్టెప్పులను ముసలావిడ కూడా వేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే ఈ డ్యాన్సింగ్ వీడియోని మామూలుగా కాకుండా ఓ థీమ్ తో చేసింది.
డ్యా్న్స్ స్టెప్పులు నేర్చుకొని ముసలావిడ అదరగొట్టగా.. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.



ముసలావిడ చూడానికే వయసు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆమెకు ఇంకా వయసు పెరగలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులోనే ఇంతలా స్టెప్పులు వేసిందంటే. . ఆ వయసులో బామ్మ అదరగొట్టేసి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. హీరోయిన్ ఛాన్స్ కోసం బామ్మ చూస్తుందేమో అంటూ కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెలబ్రెటీగా మారిపోయింది...ఆ వీడియో ఇప్పుడు ఎక్కడ చూసిన తెగ వైరల్ అవుతున్నాయి..మీరు కూడా ఆ వీడియోను చూడవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: