డొమినోస్‌ కు షాక్ ఇచ్చిన కస్టమర్..9.6 లక్షలు ఫైన్..

Satvika
చాలా మందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.కొంతమంది వారానికి ఒకసారి తినడానికి ఇష్ట పడితే..మరి కొంతమంది మాత్రం రోజు తినడానికి ఇష్టపడతారు..ముక్క లేనిది చాలా మందికి ముద్ద దిగదు.అలాంటి వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు.మరి కొంతమందికి పూర్తిగా వెజ్ తింటారు. వాళ్ళకు నాన్ వెజ్ వండుతున్న వాసన వస్తే చాలు ఆ ఛాయలు కూడా ఉండరు.అలాంటి వాళ్ళకు నాన్ వెజ్ ను ఇస్తే ఇక ఊరుకుంటారా.. అసలు ఆగుతారా.. అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. ఓ వెజిటేరియన్ వ్యక్తికి నాన్ వెజ్ ఫిజ్జా ను పంపారు.. చివరికి భారీ షాక్ తగిలింది.వివరాల్లొకి వెళితే.. ఉత్తరాఖండ్‌, రూర్కీకి చెందిన శివంగ్ మిట్టల్ సహా అతని ఫ్యామిలీ మొత్తం శాఖాహారులే. ఒకరోజు రూ.918 చెల్లించి డొమినోస్‌లో వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ అయిన ఆ పిజ్జా స్మెల్ డిఫరెంట్‌గా ఉండటంతో అనుమానం కొద్దీ ఓపెన్ చేశాడు. అది నాన్‌వెజ్ పిజ్జా కావడంతో వాసనకే వాంతులు చేసుకున్నాడు. ఈ సంఘటన అక్టోబర్ 26, 2020న జరిగింది. వెంటనే శివంగ్ పోలీసులను ఆశ్రయించాడు.అయితే అతని కేసు చాలా సిల్లీగా ఉండటం తో పోలిసులు పెద్దగా పట్టించుకోలేదు.. దాంతో అతను వినియోగదారుల ఫోరమ్ ని ఆశ్రయించాడు. తాను డొమినోస్ నిర్లక్ష్యం కారణంగా శారీరకంగా, మానసికంగానే కాదు.. ఆర్ధికంగా కూడా నష్టపోయినట్లు కోర్టుని విన్నవించాడు. జిల్లా వినియోగదారుల ఫోరమ్ చీఫ్ కన్వర్ సేన్, సభ్యులు అంజనా చద్దా, విపిన్ కుమార్ లు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. డొమినోస్ నిర్లక్ష్యంగా వ్యవరించినట్లు గుర్తించారు. దీంతో శివాంగ్ చెల్లించిన రూ.918 కు 6 శాతం వడ్డీ చొప్పున రూ.4.65 లక్షల తో పాటు ప్రత్యేక జరిమానాగా రూ. 5 లక్షలు చెల్లించాలని డొమినోస్‌ను ఆదేశించింది..మొత్తానికి అతను అనుకున్నది సాధించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: