వైరల్ : ఆ ఒంటె ఖరీదు అక్షరాల 14.23 కోట్లు!

Purushottham Vinay
ఇప్పుడు ఇస్లాం పవిత్ర మాసం నడుస్తుంది.రంజాన్ పండుగ రావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే వున్నాయి. రంజాన్ పండుగ రోజున సౌదీ అరేబియాలో ఒంటెలను బలి ఇచ్చే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అందుకే దేశంలో ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒంటెగా చెప్పుకునే ఒంటెను తీసుకొచ్చాడు. ఈ ఒంటె ఖరీదు వచ్చేసి 7 మిలియన్ సౌదీ రియాల్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.14.23 కోట్లకు అమ్ముడుపోయిందని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..సౌదీ అరేబియాలో ఈ ఒంటె కోసం బహిరంగ వేలం అనేది నిర్వహించబడింది. ఇక వేలానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో, సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి మైక్రోఫోన్ ద్వారా వేలంలో వేలం వేయడాన్ని మనం చూడవచ్చు. ఒంటె కోసం ప్రారంభ వేలంలో 5 మిలియన్ సౌదీ రియాల్ అంటే దాదాపు రూ. 10.16 కోట్లు వేయడం జరిగింది. అయితే, అది ఫైనల్ గా వేలంలో 7 మిలియన్ సౌదీ రియాల్స్‌కు ఖరారు చేయబడింది. ఇంత ఎక్కువ ధర పలికి ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.


ఇక కింద షేర్ చేసిన వీడియోలో, ఒంటెను మెటల్ ఎన్‌క్లోజర్‌లో ఉంచడం మీరు చూడవచ్చు. సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తులు ఆ ఒంటె వేలంలో పాల్గొంటునడం కూడా మీరు ఆ వీడియోలో చూడవచ్చు.ఇక ఈ ఒంటె ప్రత్యేకత ఏమిటంటే..సౌదీ అరేబియాలో ఇంత ఖరీదైన ధరకు వేలం వేసిన ఈ ఒంటె ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒంటెగా గుర్తింపు పొందింది. ఈ ఒంటె తన ప్రత్యేకత ఏంటంటే దాని అందం. ఈ ప్రత్యేకతతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఈ జాతికి చెందిన ఒంటెలు చాలా తక్కువగా వున్నాయట.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల ప్రదర్శన సౌదీ అరేబియాలో కూడా జరుగుతుంది.ప్రస్తుతం ఈ ఒంటె సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఒంటెకు సంబంధించిన వీడియోని కింద మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: