మెట్రో స్టేషన్లో మొబైల్ చూస్తూ ట్రాక్ పై పడిపోయాడు..

Purushottham Vinay
ఇక రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేవి చాలానే ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ కూడా బాగా పెంచుతున్నారు.ఇక శనివారం నాడు షహదారా మెట్రో స్టేషన్‌లో ఇలాంటి కేసు ఒకటి కనిపించింది. సీఐఎస్ఎఫ్ జవాన్ అవగాహన వల్ల ఈ ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం అక్కడ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో మొత్తం రికార్డైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికులు మొబైల్‌ చూస్తూ గడపడంలో చాలా అంటే చాలా బిజీగా ఉంటారు.దీని ఫలితంగా ఒక్కోసారి స్తంభాలను ఢీకొనడం ఇంకా ఒక్కోసారి గుంతలో పడిపోవడం అలాగే కొన్నిసార్లు రైల్వే ట్రాక్‌పై పడిపోవడం కూడా జరుగుతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదనే చెప్పాలి. మొబైల్ చూస్తూ వెళుతున్న ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పై పడిపోయాడు. 

ఇక ఈ సమయంలో CISF జవాన్‌ పెట్రోలింగ్ అనేది చేస్తున్నాడు. కొన్ని సెకన్లు ఆలస్యమైతే ఏదో ఒక మెట్రో రైల్ ఢీకొని ఆ ప్రయాణికుడి ప్రాణాలు పోయేవి. కానీ జవాన్‌ ట్రాక్‌లోకి దూకి వెంటనే కిందపడిన ఆ వ్యక్తిని పైకి లేపాడు. అక్కడి నుంచి ప్లాట్‌ ఫాం ఎక్కించి అతని ప్రాణాలు కాపాడాడు.ఇక ఈ షాకింగ్ ఘటన శుక్రవారం రాత్రి 8.43 గంటల ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్‌గా మారడంతో ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. వినియోగదారులు  అయితే ఆ CISF జవాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో మెట్రో స్టేషన్‌లో ఫోన్‌లను ఉపయోగించే వారికి ఈ సంఘటన ఒక మంచి గుణపాఠంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక మరో వినియోగదారు అయితే 'గొప్ప పని సార్' అని మెచ్చుకున్నాడు. చాలా మంది కూడా ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: