పాత కారుతో హెలికాప్టర్.. ఇది ఎలా సాధ్యమైంది గురూ?

praveen
విమానం ఎక్కాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక ఈ కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి డబ్బులు కూడా కూడపెట్టుకుంటూ ఉంటారు.. చివరికి విమానం ఎక్కాలి అనే కోరికను నెరవేర్చు కుంటూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి కి ఇలాంటి కోరిక కలిగింది. దీనికోసం అందరిలా డబ్బులు కూడ పెట్టుకుని విమానం ఎక్కాలి అని అనుకోలేదు. ఏకంగా సొంతంగా నేనే విమానం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. విమానం టికెట్ ధరకే డబ్బులు లేని వ్యక్తి దగ్గర ఇక విమానం తయారు చేసే అంత డబ్బులు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా.

 అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి ఏకంగా తన వద్ద ఉన్న పాత కార్ తోనే విమానం తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన విమానాన్ని తయారు చేసుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్లో వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లోని జోయా డయాస్ నగరానికి చెందిన విమానయాన నిపుణుడు జెనెసిస్ గోమ్స్ కేవలం పాత మోటార్ సైకిల్ లు ట్రక్కులు కార్లు సైకిల్ కు సంబంధించిన విడి భాగాలతో విమానాన్ని తయారు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఏవియేషన్ రెజిమెంట్ సందర్భంగా అతను తయారుచేసిన విమానంలో స్నేహితులతో కలిసి ఆకాశంలో చక్కర్లు కొట్టాడు.

 ఇక ఈ విమానం చూసేందుకు అక్కడి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు అనే చెప్పాలి.. తనకు విమానం ఎక్కే అవకాశం రాకపోవడం కారణంగానే తన కంటూ ఒక ప్రత్యేకమైన విమానాన్ని తయారు చేసుకోవాలని నిర్ణయించుకుని ఇలా చేశాను అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి. ఇక అతని తెలివికి ప్రస్తుతం అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.  ఏకంగా పాత కారు సహా మరికొన్ని పాత సామాన్ల తో విమానాన్ని తయారు చేసుకుని ఏకంగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: